భారతీయుల్ని ఊపు ఊపేస్తున్న శ్రీలంక పాట ‘మనికె మగె హితె’

భారతీయుల్ని ఊపు ఊపేస్తున్న శ్రీలంక పాట 'మెనికె మగె హితె'

దాదాపు 3 నెలల క్రితం యూట్యూబ్‌లో ‘మనికె మగె హితె’ అనే ఒక సింహళ పాట వచ్చింది. యోహానీ డిసిల్వా – సతీశన్ పాడిన ఈ పాట – సంగీత ప్రియుల్ని విపరీతంగా అకట్టుకుంది. మృదువైన సింహళ పదాలతో సాగే ఈ ప్రేమ గీతం యోహానీ గొంతులో అద్భుతంగా పలికింది. సింహళ భాష మనలో చాలామందికి తెలియకపోయినప్పటికీ, భారతీయుల్నే ఈ పాట ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ పాటలోని పదాలు కొంత తమిళం, కొంత సంస్కృతం పోలికల్ని కలిగి ఉండటం… దానికంటే ముఖ్యంగా ఈ పాటలోని పదాలన్నీ పొల్లులతో కాకుండా అచ్చులతో అంతమయ్యే పదాల్ని కలిగి ఉండటం ఈ పాటకి ఎంతో అందం తెచ్చాయి. అందుకే, ఇప్పుడు రకరకాల భారతీయ భాషల్లో దీనికి అనుకరణలు తయారవుతున్నాయి. ఈ పాటని తమ భాషతో మిక్స్ చేస్తూ తయారు చేసిన ఆ పాటలు కూడా ఎంతో ఆదరణ పొందుతున్నాయి.

భారతీయుల్ని ఊపు ఊపేస్తున్న శ్రీలంక పాట 'మనికె మగె హితె' 1 Teluguvadu.com : A NEW 'SIGHT' FOR TELUGU PEOPLE ::A Telugu and English Website With Exclusive Telugu News, Technology, Entertainment, Features, Fun & Animations - Telugu News Entertainment

ఉదాహరణకి మనికె మగె హితె ఒరిజినల్ పాట ఇప్పటికీ 72 మిలియన్ హిట్స్ పొందితే… దాన్ని మిక్స్ చేస్తూ ఆదర్శ్ రాయ్ తయారు చేసిన బెంగాలీ వెర్షన్ 18 మిలియన్ వ్యూస్ పొందింది. ఇలాగే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ వెర్షన్లు కూడా ఈ పాటకోసం రూపొందాయి. అలాగే కొన్ని ఫ్లూట్‌ వెర్షన్స్‌ కూడా వస్తున్నాయి. వాటిలో ఫ్లూటిస్ట్‌ రాహుల్‌ కృష్ణన్‌ వెర్షన్‌ ఎంతో ఆదరణ పొందింది. అసలు ఈ ఒరిజినల్‌ని ఆధారంగా చేసుకుని తయారుచేసిన ప్రతీ వీడియో వేలలో లక్షల్లో వ్యూస్‌ పొందుతుండడం విశేషం. ఒరిజినల్‌ వచ్చి మూడు నెలలు దాటుతున్నా – ఇప్పటికీ దీని పేరడీలూ రిమిక్స్‌లూ వెల్లువలా వచ్చి పడుతుండడాన్ని బట్టి నెటిజెన్స్‌ ఈ పాటని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది.

ఒరిజినల్‌

భారతీయుల్ని ఊపు ఊపేస్తున్న శ్రీలంక పాట 'మనికె మగె హితె' 2 Teluguvadu.com : A NEW 'SIGHT' FOR TELUGU PEOPLE ::A Telugu and English Website With Exclusive Telugu News, Technology, Entertainment, Features, Fun & Animations - Telugu News Entertainment

అయితే, ఇక్కడ మరో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట ఒరిజినల్ సింహళ వెర్షన్‌లో – ( బెంగాలీ వెర్షన్‌లో కూడా ) మొదటి నుంచీ చివరి వరకూ … కూడా మనకి ప్రస్ఫుటంగా పాటంతా కనిపించేది రోడ్ మైక్ . రోడ్ కంపెనీ మైక్స్ ఆడియో రికార్డింగ్ విషయంలోనూ, మ్యూజిక్ రికార్డింగ్‌ విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందినవి. వీటి ఖరీదు ఎక్కువైనప్పటికీ, ఇవి ఇచ్చే ఆడియో క్వాలిటీని మరే మైకులూ ఇవ్వవని అంటారు. ఒక విధంగా చెప్పాలంటే – సూపర్‌ హిట్‌ అయిన ‘మనికె మగె హితె’ పాట రోడ్ మైక్స్‌కి భారతీయుల్లో ఒక గొప్ప ప్రచారం ఇచ్చినట్లయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ పాటలో మనం మొదటి నుంచీ చివరి వరకూ యోహానీ, సింగర్ల ముఖంతో పాటుగా ఈ రోడ్ మైక్ లోగోని కూడా చూడాల్సి వస్తుంది.

ఏదేమైతేనేం – అంత ఈజీగా మరిచిపోలేని ఒక మంచి పాటని అందించిన మ్యుజిషియన్లకీ సంగీత ప్రియులందరూ ధ్యాంక్స్ చెప్పాల్సిందే.

ఈ పాట లింక్స్‌ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ పాట పల్లవి లిరిక్స్ తెలుగులో కావాలనుకునేవారి కోసం ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది.

మనికే మగే హితే
ముదువే నురా హెంగుమ్‌ యావీ
అవి లేవీ

నెరియే నుంబే నగే
మగెనె త్తేహా మేహా యావీ
సిహి లేవీ

మా
హిత లంగమ దేవతెనా
హురు పెమక పెతలెనా

రువనారి మనహారి
సుకుమాలి నుంబ తమా

మనికే మగే హితే

బెంగాలీ వెర్షన్‌

TAMIL & Another Bengali Version

Hindi Version

Telugu Version

Telugu Kannada

Tamil Version By Original Singer

Flute Version

This post is also available in: ఇంగ్లిష్‌