ఎన్టీఆర్‌ కృష్ణుడిగా… ఏ స్టిల్‌ ఏ సినిమాలోది? కనిపెట్టండి!


రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్‌ వేసిన వేషాలకి తెలుగువారు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్‌ నటన అనన్యసామాన్యం. ఆఖరికి తమిళ సినిమాల్లో కృష్ణుడు కావాలన్నా- ఎన్టీఆర్‌నే అడిగేవారు. సామాన్య పాత్రల్లో కాస్త మోటగా, బండగా కనిపించే ఎన్టీఆర్‌ - కృష్ణపాత్రకి వచ్చేసరికి సుకుమారంగా కనిపించడం గొప్ప విశేషం. వయసు మీరిన తరవాత వచ్చిన సినిమాల విషయం పక్కన పెడితే - పాత సినిమాల్లో మాత్రం - కృష్ణుడంటే ఇలాగే ఉంటాడేమో అనే స్థాయిలో ఎన్టీఆర్‌ నటన ఉండేది. వివిధ కాలాల్లో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించిన సినిమాలు ఇక్కడ కొన్ని ఇస్తున్నాం. కృష్ణుడి వేషంలోని ఎన్టీఆర్‌ వయసు, వేషధారణ - ఆధారంగా ఆ ఫలానా స్టిల్‌ ఏ సినిమాలోనిదో గుర్తుపట్టడానికి ప్రయత్నించండి! తెలుగుజాతినీ, తెలుగుభాషనీ అమితంగా ప్రేమించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ క్విజ్‌ మీకోసం! ( కింద రెడ్ కలర్లో ప్లే బటన్ నొక్కండి. )


Question 1 of 14.

మందహాస కృష్ణుడు

పక్క చూపు చూస్తూ చిరునవ్వు ఒలికిస్తున్న ఈ కృష్ణ పాత్ర ఏ చిత్రంలోది?

1. శ్రీమద్విరాటపర్వము
2. కర్ణ (తమిళం)
3. శ్రీకృష్ణ విజయము

శ్రీకృష్ణ విజయము సరయిన జవాబు

కొన్ని భాగాలు మాత్రం కలర్లో తీసిన ( పార్ట్లీ కలర్ ) చిత్రం శ్రీకృష్ణ విజయము 1971 లో వచ్చింది.

Question 2 of 14.

బుంగమూతి కృష్ణుడు

తొలినాళ్లలో బుంగమూతి పెట్టిన కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఏ చిత్రంలోది?

1. దీపావళి
2. వినాయకచవితి
3. మాయాబజార్

వినాయక చవితి సరయిన జవాబు

వినాయక చవితి 1957 లో విడుదలయిన చిత్రం. మాయాబజార్ రిలీజయిన సంవత్సరమే ఇది కూడా విడుదలయింది.

Question 3 of 14.

సాలోచనా కృష్ణుడు

ఏదో ఆలోచనతో ఎవరికో సలహాలనిస్తున్నట్టు కనిపించే ఈ కృష్ణరూపం ఏ చిత్రంలోదో తెలుసా?

1. శ్రీకృష్ణావతారం
2. శ్రీకృష్ణ సత్య
3. శ్రీకృష్ణ పాండవీయం

శ్రీకృష్ణపాండవీయం సరయిన జవాబు

శ్రీకృష్ణపాత్రతో బాటు దుర్యోధనుడికి కూడా సమప్రాధాన్యం ఇస్తూ ఎన్టీఆర్ సొంత దర్శకత్వంలో తీసిన సినిమా శ్రీకృష్ణ పాండవీయం

Question 4 of 14.

ఆశీర్వచన కృష్ణుడు

తానే కృష్ణుడైనంత ఆత్మవిశ్వాసంతో ఎన్టీఆర్ దీవెనలు కురిపిస్తున్న ఈ వేషం ఏ సినిమాలోది?

1. వీరాభిమన్యు
2. శ్రీకృష్ణ విజయము
3. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం

వీరాభిమన్యు సరయిన జవాబు

అప్పటికే ఎన్నో చిత్రాల్లో శ్రీకృష్ణపాత్రలో విజయం సాధించిన ఎన్టీఆర్ - అప్పుడప్పుడే హీరోగా పైకొస్తున్న శోభన్ బాబు చిత్రం వీరాభిమన్యులో కృష్ణుడిగా నటించమని కోరగా - తన ప్రాధాన్యం తగ్గకుండా ఉండడానికి ఎన్నెన్నో కండిషన్లు పెట్టారని అంటారు.

Question 5 of 14.

చిద్విలాస కృష్ణుడు

చేతులు కట్టుకుని శాంతంగా చిద్విలాసంగా కనిపిస్తున్న ఈ కృష్ణవేషం ఏ సినిమాలోది?

1. శ్రీకృష్ణార్జున యుద్ధము
2. వీరాభిమన్యు
3. శ్రీకృష్ణ పాండవీయం

శ్రీకృష్ణార్జున యుద్ధము సరయిన జవాబు

మాయాబజార్ దర్శకుడు కేవీరెడ్డి, మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధములో ఎన్టీఆర్ కృష్ణపాత్ర అవలీలగా పోషించడం చూసినప్పుడు ఆయన ఆ పాత్రకి అప్పటికే బాగా అలవాటుపడ్డట్టు తెలుస్తుంది.

Question 6 of 14.

ఆభరణ కృష్ణుడు

ఆభరణాలతో తులతూగే ఈ కృష్ణుడిపాత్ర ఏ చిత్రానికి చెందిందో సులువుగా చెప్పవచ్చు. చెప్పండి మరి?

1. శ్రీకృష్ణ విజయము
2. దానవీరశూర కర్ణ
3. శ్రీకృష్ణతులాభారము

శ్రీకృష్ణతులాభారము సరయిన జవాబు

రాముడు-భీముడుతో తెలుగు సినిమాల్లోకి నిర్మాతగా వచ్చిన డి.రామానాయుడు నిర్మాతగా నిలదొక్కుకోవడానికి తొలిదశలో గొప్ప సోపానం అయిన చిత్రం శ్రీకృష్ణతులాభారం.

Question 7 of 14.

ప్రబోధ కృష్ణుడు

ఏదో దీక్షగా నీతిని బోధిస్తున్నట్టున్న ఈ కృష్ణుడి స్టిల్ ఏ చిత్రంలోది?

1. శ్రీకృష్ణావతారం
2. శ్రీకృష్ణ పాండవీయం
3. దీపావళి

దీపావళి సరయిన జవాబు

1960 లో వచ్చిన చిత్రం దీపావళి.

Question 8 of 14.

ముదురు కృష్ణుడు

కాస్త ముదురుగా కనిపించే ఈ కృష్ణపాత్ర ఏ చిత్రంలోది?

1. దానవీరశూర కర్ణ
2. శ్రీకృష్ణతులాభారము
3. శ్రీమద్విరాటపర్వము

దానవీరశూర కర్ణ సరయిన జవాబు

నటుడిగా అనుభవం పెరిగిపోయి, తనకి తిరుగేలేదన్న కాలంలో స్వీయదర్శకత్వంలో ఎన్టీఆర్ తీసిన చిత్రం దానవీరశూర కర్ణ. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతం అని అంటారుగానీ, అతి పొడవైన ఈ చిత్రాన్ని ఈ కాలంలో భరించడం కష్టం.

Question 9 of 14.

మందగమన కృష్ణుడు

సత్యభామ ఇంటి వైపు నెమ్మదిగా నడిచి వెళ్తున్న ఈ కృష్ణపాత్ర ఏ చిత్రంలోది?

1. శ్రీకృష్ణ విజయము
2. మాయాబజార్‌
3. శ్రీకృష్ణ సత్య

శ్రీకృష్ణ సత్య సరయిన జవాబు

1972 లో వచ్చిన శ్రీకృష్ణ సత్య సినిమా సత్యభామా కృష్ణుల ప్రణయ గాథలచుట్టూ నడుస్తుంది.

Question 10 of 14.

చిలిపి కృష‌్ణుడు

పాత్రలో అవలీలగా లీనమైపోయే అనుభవం కనిపిస్తున్న ఈ కృష్ణపాత్ర ఏ చిత్రంలోది?

1. మాయాబజార్‌
2. కర్ణ(తమిళం)
3. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సరయిన జవాబు

1972 లో వచ్చిన ఈ శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో రామారావు జానపద చిత్రాల విలన్ రాజనాల హనుమంతుడి పాత్రలో నటించడం విశేషం.

Question 11 of 14.

వృద్ధ కృష్ణుడు

వయసు మీద పడినా ప్రేక్షకుల్ని రంజింపజేయగలనన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న ఈ కృష్ణపాత్ర ఏ చిత్రంలోది?

1. శ్రీమద్విరాటపర్వము
2. శ్రీకృష్ణావతారం
3. దానవీరశూర కర్ణ

శ్రీమద్విరాటపర్వము సరయిన జవాబు

అయిదు పాత్రల్లో అన్నీ తానై ఎన్టీఆర్ అలవి మీరిన ఆత్మవిశ్వాసంతో తీసిన ఈ చిత్రం నర్తనశాల సినిమాకు మరో రూపం. అయితే ఎన్టీఆర్ తన భావాలకి అనుగుణంగా పురాణాల్ని వక్రీకరించడం విమర్శలకు గురయింది.

Question 12 of 14.

కలవరపాటు కృష్ణుడు

కృష్ణపరమాత్ముడు దేనికో కలవరపడుతున్నట్టున్న ఈ స్టిల్ ఏ చిత్రంలోది?

1. శ్రీకృష్ణార్జున యుద్ధం
2. మాయాబజార్
3. కర్ణ (తమిళం)

మాయాబజార్ సరయిన జవాబు

మాయాబజార్ మొదట విడుదల అయినప్పుడు బ్లాక్ అండ్ వైట్ చిత్రం. అయితే ఇటీవల మాయాబజార్ సినిమాని గోల్డ్ స్టోన్ అనే కంపెనీవాళ్లు కలర్ చేయడం జరిగింది.

Question 13 of 14.

రాయబార కృష్ణుడు

కౌరవ సభలో కురుక్షేత్ర రాయబారం చేస్తున్న ఈ కృష్ణపాత్ర ఏ చిత్రంలోది?

1. శ్రీకృష్ణావతారం
2. శ్రీకృష్ణతులాభారము
3. శ్రీకృష్ణ పాండవీయం

శ్రీకృష్ణావతారం సరయిన జవాబు

1967 లో వచ్చిన ఈ చిత్రంలో సత్యనారాయణ, శోభన్ బాబు కూడా ఉన్నారు.

Question 14 of 14.

హావభావ కృష్ణుడు

ముదురు నీలంరంగులో అతిగా హావభావాలు ప్రకటిస్తున్న ఈ కృష్ణవేషం ఏ సినిమాలోదో చెప్పండి.

1. శ్రీకృష్ణ విజయము
2. శ్రీకృష్ణావతారం
3. కర్ణన్ ( తమిళం )

కర్ణన్ (తమిళచిత్రం) సరయిన జవాబు

శివాజీ గణేశన్ కర్ణుడిగా నటించిన ఈ కర్ణన్ చిత్రం కర్ణ అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది. ఈ సినిమాలో శివాజీ పాత్రకు ఎనలేని పేరొచ్చింది. ఆ స్ఫూర్తితోనే తరవాతి కాలంలో దానవీరశూర కర్ణ తీశాడు ఎన్టీఆర్.

Next question 1 of 14

All 14 questions completed!


Share results:

ఎన్టీఆర్‌ కృష్ణుడిగా... ఏ స్టిల్‌ ఏ సినిమాలోది? కనిపెట్టండి!

Want more stuff like this?

Get the best viral stories straight into your inbox!
Don`t worry, we don`t spam


ADVERTISE HERE