ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌దలు.. విరాళం ప్ర‌క‌టించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌దలు.. విరాళం ప్ర‌క‌టించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు, నాలుగు ద‌క్షిణ కోస్తా జిల్లాలో కొన్నిరోజుల నుంచి అసాధార‌ణ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీని వ‌ల్ల ప్రాణ నష్టం, ఆస్థి న‌ష్టం జ‌రిగింది. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ప్ర‌జ‌లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళంగా అంద‌చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ‘‘ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. వాటి కార‌ణంగా ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి సాయం చేసే దిశ‌గా నేను చిన్న అడుగు వేశారు. అందులో భాగంగా రూ.25 ల‌క్ష‌లు విరాళం అందిస్తున్నాను’’ అని తెలిపారు.

This post is also available in: ఇంగ్లిష్‌