’ఓయో’ చేస్తున్న ‘ఓయే’ చూశారా?

SriRamaNavami

వ్యాపారం పెంచుకోవడం కోసం వ్యాపారులు ఎన్నెన్నో ట్రిక్స్ చేస్తుంటారు. అది సినిమా కావచ్చు, వేరే మరేదైనా వ్యాపారం కావచ్చు. ప్రకటనల ద్వారా జనానికి చేరువకావాలని కోరుకుంటుంటారు.

పెద్ద పెద్ద బిల్ బోర్డ్‌లు, హోర్డింగులు, సైన్ బోర్డులు రోడ్డు పక్క ఆకర్షణీయంగా పెట్టి, ప్రజల చూపును తమవైపు తిప్పుకుని, తద్వారా వ్యాపారం పెంచుకోవాలని అనుకోవడం వ్యాపార ధర్మం కావచ్చు. అయితే, పెద్ద పెద్ద భవనాల్నే మూసివేసేలాగా, – వాటి కిటికీలూ, తలుపులూ లోకానికి కనిపించకుండా మూసుకుపోయేంతగా – బిల్డింగ్‌ లోపలి భాగాన్ని కూడా చీకటి చేసేంతగా స్టిక్కరింగ్ చేసేసి – ఒక వికృతమైన ప్రకటనల ధోరణికి OYO తెరతీసింది ఇప్పుడు.

ప్రయాణాలు చేసేవారికి ఉపయోగపడే యాప్‌ OYO. Oyo యాప్‌ ద్వారా ఏ ఊళ్లోనైనా రూమ్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఏదయినా ఊరు వెళ్లినప్పుడు – అక్కడిక రైలు టికెట్‌ కొన్నప్పుడే – అక్కడ హోటల్ రూమ్‌ బుక్ చేసుకోవడానికి OYO ని వాడుతూ ఉంటారు.

ఇప్పుడు ఈ OYO వాళ్లు నగరాలన్నిటిలో తమ బ్రాండ్‌ని మరింతగా ప్రచారం చేసుకోవడానికి ఒక చిత్రవిచిత్రమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద పెద్ద రెడ్ స్టిక్కర్స్‌ని బిజీ రోడ్ల పక్కన ఉండే పెద్ద పెద్ద భవనాల పైన అతికిస్తున్నారు. ఈ స్టిక్కర్స్ ఎంత పెద్దవంటే – అవి బిల్డింగ్ తలుపులు, కిటికీలన్నీ మూసేసేంత పెద్దవి. ఈ పెద్ద పెద్ద స్టిక్కర్స్‌ని భవనాలకి గోడ ఎడ్జ్‌ లో అటు సగం, ఇటు సగం కనబడేలా అతికిస్తున్నారు. ఆ భవనాల వాళ్లు కమర్షియల్‌ దృక్పథంతో ఈ ఘోరానికి ఎలా ఒప్పుకుంటున్నారో గానీ… చూసేవాళ్లకు మాత్రం ఇది చాలా వికారంగా కనిపిస్తోంది. లోపల కూడా వెంటిలేషన్‌ దెబ్బతిని భవనాలు చీకటి గుయ్యారాలుగా మారుతున్నాయి.

” ఎంత వ్యాపారం అయితే మాత్రం – మరీ ఆ భవనాల తలుపులు మూసివేసేలా స్టికర్లు అతికించాలా? ఎంత వికృత వ్యాపారధోరణి! ” అని జనం నోళ్ళు నొక్కుకుంటున్నారు. నిజమే! ఎంత వ్యాపారం అయినా, OYO వాళ్లు కాస్త ఈ OA (over action) తగ్గించుకుంటే మంచిది.

 

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu