స్వాతంత్ర దినోత్సవం నాడు యోధుడి స్టిల్‌


ఏదైనా టైమ్‌ ప్రకారం ఉండాలి. టైమ్లీ వీడియోస్‌ టైమ్లీ కామెంట్స్‌.. టైమ్లీ పోస్టింగ్స్‌ … ఏదైనా టైమ్ ప్రకారం ఉన్నవన్నీ ఈజీగా వర్కవుట్‌ అవుతాయి. ఆఖరికి సినిమా రిలీజ్‌ చేయాలన్నా టైమ్‌ కలిసి రావాలి. పెద్ద సినిమాల మధ్య రిలీజయితే – చిన్న సినిమా బాగున్నా చితికిపోవచ్చు. పెద్ద సినిమా అయినా టైమ్‌కి పడితేనే ఓ రేంజ్‌ దాటి సక్సెస్‌ అవుతుంది. అందుకేనేమో మెగాసినిమా సైరా విషయంలో టైమ్లీగా కేర్‌ తీసుకుంటున్నారు.

‘సైరా’ సినిమా నరసింహారెడ్డి అనే వీరుడి కథ. రాయలసీమలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎక్కువ పాపులర్‌ కాకపోయినప్పటికీ – ఆయన దేశంకోసం పోరాడిన యోధుడని కొందరికి తెలుసు. ఆ గాథను అందరికీ తెలియజేయడం నిజంగా మంచి పని. అందుకే స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మంచి స్టిల్‌ని రిలీజ్‌ చేశారు. అది ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE