‘సిరివెన్నెల’కి శివాజీరాజా అభినందనలు

SriRamaNavami

అవార్డులొచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు. అయితే – అర్హత గలవారికి అవార్డులొచ్చినపుడు అభినందించడంతో బాటు అందరూ సంతోషిస్తారు. కొందరు అవార్డులకోసం నిరీక్షిస్తారు. కానీ కొందరికి అవార్డు రాకపోతే ప్రజలు నిరీక్షిస్తారు. ఆ రెండో కోవకి చెందిన వ్యక్తి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ఇప్పుడు సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ ఆయనలోని సారస్వత శక్తికి ఓ చిన్ని మెచ్చుకోలు మాత్రమే! దశాబ్దాల కాలం పాటు నిబద్ధతతో ఆయన చేసిన రచనలు ఆయనకు ప్రజల్లో ఎప్పుడో ఆదరణను ఆర్జించిపెట్టాయి. ఇప్పుడు దానికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసినట్టయింది. ‘సిరివెన్నెల’ వారు పద్మశ్రీ పొందిన సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా – సన్నిహితులతో సహా ఆయన ఇంటికి వెళ్లి అభినందించి వచ్చారు. శివాజీకి సిరివెన్నెలతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అతని తొలిసినిమా ‘కళ్లు’ సినిమాలో సీతారామ శాస్త్రి పాడిన ‘తెల్లారింది లెగండో’ సాంగ్‌ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఓ గొప్ప వ్యక్తికి గుర్తింపు వచ్చినపుడు వెంటనే అభినందించడం సంప్రదాయం. ఇటీవలి కాలంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కుంటూ పరువు పోగొట్టుకుంటున్న తెలుగు సినీ చిత్ర పరిశ్రమ – కనీసం ఇలాంటి పనుల వల్లనైనా తన గౌరవాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. కానీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఒకరిద్దరితో అభినందించడం కాకుండా – అసోసియేషన్‌ తరఫున సినీ ప్రముఖులంతా ఆయన్ని సన్మానించాల్సిన అవసరం ఉంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu