సమంతా అభిమానులకు ఈ ఏడాది పండగే..!

SriRamaNavami

టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోయిన్స్ లో ఒకరు అక్కినేని సమంతా. అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకోని ముందు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. క్రిందటి ఏడాది సమంతా హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘రాజు గారి గది-2’, మెర్సల్ సినిమాలు వచ్చినా అందులో సమంతా కొద్దిసేపు మాత్రమే కనిపించింది. సమంతా నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారనే చెప్పాలి.
సమంతా ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఈ ఏడాది సమంతా నామ సంవత్సరంగా మారబోతోంది. ఈ ఏడాది సమంతా చాలా బిజీ.. అటు షూటింగ్స్ ఇటు రిలీజ్స్ తో బాగా బిజీ అయింది. మార్చి మొదలు సమంతా వి వరస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మొదటిగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత సమంతా కీలక పాత్ర పోషించిన ‘మహానటి’ రిలీజ్ అవుతుంది. ఇక తమిళంలో విశాల్ హీరోగా వస్తున్న ‘ఇరుంబు తిరై’ ఫిబ్రవరి లో రిలీజ్ అవుతుండగా తెలుగు వెర్షన్ మార్చి లో రిలీజ్ అవుతుంది. ఆమె నటిస్తున్న ‘సూపర్ డీలక్స్’ సినిమా కూడా సమ్మర్ కి రిలీజ్ అవుతుండగా శివ కార్తికేయన్ హీరోగా ఆమె నటిస్తున్న ‘టెన్కాశి’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘యు టర్న్’ రీమేక్ ఈ నెల చివరి వారం లేదా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లి ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. మొత్తం మీద ఈ ఏడాది సమంతా అభిమానులకు పండగే పండగ.


PremaLekhalu