వాల్మీకి టీజర్‌ రిలీజ్‌.. త్వరలో!


పూర్వం సినిమా అంటే సినిమా ఒక్కటే రిలీజయ్యేది. భవిష్యత్తులో టీజర్‌ రిలీజ్‌ డేట్‌ చెప్పే రోజు ఫలానా అంటూ ఈవెంట్‌ లిస్ట్‌ని ఇంకో డెప్త్‌ పెంచినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

పూర్వం సినిమా అంటే సినిమా ఒక్కటే రిలీజయ్యేది. మహా అయితే దాని ముందు ఓ యాడ్ విడుదల చేసేవారు. వచ్చేవారం అనో.. రేపు విడుదల అనో.. కాస్త ముందుగా చెప్పేవారు. ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రయిలర్‌, ఆడియో ఫంక్షన్‌.. రిలీజ్‌ ముందు ఎన్నో చేష్టలు.. ఎంతో గోల… టీజర్‌ రిలీజ్‌ చేస్తే పరవాలేదు. ఆ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పడం కూడా ఒక ఈవెంటే అయిపోయింది! ‘వాల్మీకి’ సినిమా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఆగస్ట్‌ 15 అట! భవిష్యత్తులో టీజర్‌ రిలీజ్‌ డేట్‌ చెప్పే రోజు ఫలానా అంటూ ఈవెంట్‌ లిస్ట్‌ని ఇంకో డెప్త్‌ పెంచినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

బాబూ మెగా అభిమానులూ! అపార్థాలు చేసుకోకండి. మేం ఈ ఒక్క సినిమా గురించీ అనడం లేదు. ప్రతీ సినిమానీ ఇలాగే మొదటినుంచీ ప్రమోట్‌ చేసుకోవాల్సిన దుస్థితి గురించి కామెంట్‌ చేస్తున్నాం, అంతే! ఏం చేస్తాం! సినిమా అలా అయిపోయింది మరి!

ఇదిగో వాల్మీకి టీజర్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌ స్టిల్ ఇదిగో!


ADVERTISE HERE