వాట్సాప్‌ కోసం ఫ్రీ స్పేస్‌ ఇస్తున్న గూగుల్‌!


గూగుల్‌, వాట్సాప్‌ రెండూ కలిసి మనకి ఓ కొత్త సౌకర్యం తీసుకొచ్చాయి. ఇకపైన వాట్సాప్ బ్యాకప్స్ ఏవైనా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే – అది గూగుల్ డ్రైవ్ స్టోరేజిలోకి లెక్కకు రాదు. అంటే, మీరు ఎంత వాట్సాప్ చాట్ బ్యాకప్ తీసి డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నప్పటికీ – మీ రెగ్యులర్ గూగుల్ డ్రైవ్ స్టోరేజీ అన్నది తగ్గదు. వాట్సాప్‌కీ గూగుల్‌కీ మధ్య కుదిరిన ఒక కొత్త ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం వచ్చింది. అయితే పాత బ్యాకప్స్ విషయంలో మాత్రం ఓ రూల్‌ పెట్టారు. గూగుల్‌ లో సేవ్‌ చేసి ఉన్న వాట్సాప్ బ్యాకప్స్ ఏవైనా – ఒక ఏడాది కాలం కంటే ఎక్కువ సమయం నుంచీ అలాగే అప్‌ డేట్ చేయకుండా వదిలేసి ఉంటే – వాటిని మాత్రం ఈ కొత్త పాలసీ ప్రకారం – గూగుల్ డ్రైవ్ నుంచి తీసేస్తారు. ఈ కొత్త పాలసీ నవంబర్ 12వ తేదీ నుంచీ అమలవుతుంది. కాబట్టి ఆ పాత బ్యాకప్స్ ఏవైనా కావాలీ అనుకుంటే, నవంబర్ 12, 2018లోగా మేన్యువల్‌గా గూగుల్ డ్రైవ్‌లోంచి డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి.
ఆ పాత బ్యాకప్స్‌ని రిఫ్రెష్ చేసి కొత్తగా అప్ డేట్ చెయ్యాలనుకుంటే అక్టోబర్ 30 లోపుగా అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడు అవి కూడా గూగుల్ డ్రైవ్‌లో భద్రంగా ఉంటాయి. ఏమైనా వాట్సాప్‌, గూగుల్‌ ఒప్పందం వల్ల మెమరీ ఖర్చు లేకుండా చాట్స్‌ అన్నీ సేవ్‌ చేసుకోవచ్చు. మంచి సదుపాయమే కదా?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu