‘రొమాంటిక్’ హీరోయిన్‌గా ‘డబ్‌ స్మాష్‌ క్వీన్‌’


యంగ్ బడ్డింగ్‌ హీరో ఆకాష్ పూరి తరవాతి చిత్రం ‘రొమాంటిక్’ లో హీరోయిన్‌గా మోడల్ కేతికా శర్మని తీసుకున్నారు. ‘డబ్‌ స్మాష్‌ క్వీన్‌’ గా పేరు తెచ్చుకున్న క్రేజీ మోడల్‌ కేతికా శర్మ. కొత్త దర్శకుడు అనిల్ పాడూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఒక అందమైన ప్రేమ కథట. చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సినిమాలో ఆకాష్‌ కొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తాట్ట.దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. పూరి, చార్మి కౌర్ నిర్మాతలుగా పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్‌ – పూరి కనెక్ట్స్‌ బ్యానర్స్‌ మీద ఈ సినిమా వస్తోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu