రామ్‌ గోపాల్‌ వర్మని మించిన మేధావులు ఇరుగో!


ప్రమోషన్‌ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మని మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఐదు పైసలు ఖర్చు లేకుండా మీడియా మొత్తాన్ని తన వెనక తిప్పించుకునే మేధావి ఆర్జీవీ. కానీ అందుకోసం ఆయన ఎంతో బ్రెయిన్‌ వాడాల్సి వస్తోంది. అలా అవసరం లేకుండా – కేవలం నిద్ర మీద ఆధారపడి ప్రొడక్ట్‌ పబ్లిసిటీని పెంచుకునే మహా మేధావులు కూడా ఉన్నారు. చివరివరకూ చదవండి. మీకే అర్థమవుతుంది.

పనిచేసే చోట ఏమాత్రం కునుకు తీసినా అదో పెద్ద నేరంలా చూస్తుంటాయి యాజమాన్యాలు. నిజమే! పని మానేసి నిద్రపోవడం సరయిన పని కాదు. కానీ ఒక వయసు దాటిన తరవాత – – చాలామందికి మధ్యాహ్నం భోంచేశాక ఓ పది ఇరవై నిమిషాల పాటు కునుకు రావడం సహజం. అయినా ఇది ఉద్యోగపరంగా చూస్తే నెగిటివ్‌ పాయింటే అవుతుంది. కానీ హాయిగా నిద్రపోతే లక్ష రూపాయలిస్తామంటున్నారు ఓ కంపెనీవాళ్లు. వేక్‌ ఫిట్‌ ( WakeFit ) అనే కంపెనీ వాళ్లు ఈ కొత్తరకం ఆఫర్‌తో జనాన్ని ఆకర్షిస్తున్నారు. వాళ్ల పరుపుల మీద రోజుకి తొమ్మిదిగంటల పాటు… వారంలో ఎక్కడా గ్యాప్‌ లేకుండా 100 రోజుల పాటు అలా హాయిగా నిద్రపోతే లక్ష రూపాయలు ఇస్తారట. ఈ గొప్ప జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ కూడా ఇచ్చారు.

ఇంతకీ ఈ జాబ్‌కి అప్లై చేయడానికి అర్హతలు ఏంటంటే – సందు దొరికితే చాలు నిద్రపోయే మైండ్‌ సెట్‌ కావాలట.

ఎందుకిలా? వాళ్లకేమైనా పిచ్చా? నిద్రపోతే డబ్బు ఇవ్వడం ఏంటండీ? – అనకండి. అంత తెలివితక్కువ వాళ్లెవరూ లేరిక్కడ! వేక్‌ఫిట్‌ ( WakeFit ) అనే కంపెనీ పరుపులూ వగైరా ఉత్పత్తుల్ని తయారుచేస్తుంది. వాటిని ప్రమోట్‌ చేసుకోవడం కోసమే ఈ పథకం. ఈ ఆఫరేంటబ్బా అంటూ ఆశ్చర్యపోయి అందరూ అప్లై చేస్తారు కదా? ఏ ఒకరిద్దరికో లక్ష రూపాయలు ఇస్తే చాలు. కానీ జరిగే ప్రచారం విలువ? కోట్ల రూపాయల్లో ఉంటుంది. చూశారా? మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవాలంటే రామ్‌ గోపాల్‌ ప్రాణాలు రిస్క్‌ చేసి సంచలనాలు చేయాల్సిన పని లేదు. ఛానెల్స్‌ వెనక తిరగాల్సిన పని లేదు. ఇలాంటి ఓ ఐడియా పెట్టుకుంటే – ప్రమోషన్‌ దానంతటదే హాయిగా జరిగిపోతుంది. యజమాని హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.

https://www.wakefit.co/sleepintern/

58 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE