రాజధానిని అప్పజెప్పేటప్పుడు ‘రైతు నీతి’ ఏమయింది?

SriRamaNavami

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ వాళ్లే విత్తనాలు వేశారనీ, నీళ్లు పెట్టారనీ, ఎరువులు వేశారనీ, పురుగుమందులు కూడా వాడారనీ, చివరకు తెలంగాణ అనే పంటను పండించారనీ, చివరకు ఆ పంట మొత్తాన్నీ టీఆరెస్ కోసుకుపోయిందనీ ఈ రోజు కాంగ్రెస్‌ అంటోంది. పంటకి మద్దతు ధర లభించని రాజకీయ రైతుల్లా ఆజాద్‌ లాంటివాళ్లు మాట్లాడుతున్నారు. మరి ఎంతో కాలంగా అందరికీ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర లేదా? వాళ్ల ఆశలూ జీవితాలూ దాంతో ముడిపడిలేవా? పంటలూ ఫలితాలూ అంటూ ఇప్పుడు కాంగ్రెస్‌ ‘రైతునీతి’ చెబుతోంది కదా? మరి ఆనాడు తన స్వార్థం కోసం తెలంగాణ ఇచ్చేటప్పుడు – హైదరాబాద్‌లో ఆంధ్రావారికి ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా మొత్తం గుత్తగా తెలంగాణకే అప్పజెప్పినప్పుడు కాంగ్రెస్‌ బుద్ధి ఏమయింది? – అని ఆంధ్రులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. శ్రీశ్రీ ఆజాద్‌ గారు ఈరోజు కేవలం పార్టీ దెబ్బతిందనే ఇంత బాధపడుతున్నారే! – ఆనాడు కాంగ్రెస్‌ ఏకపక్షంగా తీసుకున్న ఘోరమైన నిర్ణయం – ఏమాత్రం న్యాయం జరగకుండా చేసిన విభజన – ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని కొన్ని తరాల పాటు కెరీర్లూ జీవితాలూ వెనకబడిపోయేలా చేసింది. మరి వారి ఆవేదన, గుండె కోత కాంగ్రెస్‌ వారికి అర్థం కావడం లేదా? రాజధాని కూడా లేకుండా చేసి తమ జీవితాల్ని నాశనం చేయడానికి పూనుకున్న కాంగ్రెస్‌ పట్ల ఆంధ్రులు ఇంకెంతటి ఆరోపణలు చేయాలి? – అన్నది ఆంధ్రుల ప్రశ్న. మరి ఆజాద్‌ గారు ఏం సమాధానం చెబుతారో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu