మిస్‌ యూనివర్స్‌లా అనిషా ఆంబ్రోస్‌

SriRamaNavami

అందం, ఆకర్షణ ఉన్నా – చేసిన సినిమాల్లో చాలావరకూ చెత్త కావడం వల్ల హీరోయిన్‌ అనిషా ఆంబ్రోస్‌ కి రావాల్సిన పేరు రాలేదు. అయితే ఇప్పుడు వస్తున్న ‘సెవెన్‌’ మూవీలో జెన్నీ అనే పాత్రలో ఆమె లుక్‌ అదిరిపోయింది.  అనిషా 2013 నుంచీ సినిమాల్లో ఉంది. అలియాస్‌ జానకి అనే మూవీతో ఆమె సినిమా కెరీర్‌ స్టార్టయింది. గోపాల గోపాల, ఉన్నది ఒకటే జిందగీ, ఒక్కడు మిగిలాడు, ఈ నగరానికి ఏమయింది? – ఇలా చాలా సినిమాలు చేసినా గుర్తింపు ఏమాత్రం రాలేదు. కన్నడలో కూడా సెకండ్‌ హ్యాండ్‌ లవర్‌ అనే రొమాంటిక్‌ చిత్రంలోనూ, కర్వ అనే హారర్‌ మూవీలోనూ చేసింది. కర్వ హిట్టయినా ఈమెకి తగిన గుర్తింపు రాలేదు. మలయాళంలో కూడా విస్మయం అనే ఓ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో ‘విఠలాచార్య’ అనే మూవీలో చేస్తోంది. తాజాగా ‘సెవెన్‌’ మూవీలో చేస్తోంది. బాహుబలి తరవాత సినిమాల్లోని కారెక్టర్లని వరసగా రిలీజ్‌ చేసే కల్చర్‌ పెరిగింది.  సెవెన్‌ మూవీలో ఆమె చేస్తున్నది జెన్నీ అనే పాత్ర. అందులో ఆమె లుక్‌ అదిరిపోయింది. ఆమె అచ్చం ఒకప్పటి మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ లా ఉందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. చూద్దాం. మరి ఈ సినిమా అయినా అనిషా లైఫ్ ని మలుపు తిప్పుతుందేమో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu