మళ్లీ గోవిందా అంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ

SriRamaNavami

సర్కార్‌ త్రీ ట్రయలర్‌ చూశారా? ఆ బీజీ మ్యూజిక్‌ని గుర్తించారా? ఏంటి? గుర్తు రాలేదా? చాలా ఏళ్ల క్రితం – కరెక్ట్‌ గా చెప్పాలంటే – దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం – 1994 లో వచ్చిన సినిమా గోవిందా గోవిందా సినిమాలో వాడిన బీజీ మ్యూజిక్‌ ఇదే! గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా… అంటూ వస్తుంది.  వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని దొంగిలించే విదేశీయుల కథ అది. తిరుపతి బ్యాక్‌గ్రౌండ్‌ లో ఇలాంటి యాంటీసెంటిమెంట్‌ కథ తీసుకోవడం వల్లో ఏమో జనానికి అది ఎంతమాత్రం నచ్చలేదు. సినిమా ఫ్లాపయింది. పైగా అప్పట్లో ఈ సినిమాని సెన్సార్‌ చేసే విషయంలో శర్మ అనే సెన్సార్‌ బోర్డ్‌ అధికారితో వర్మకి గొడవ అయింది. దాంతో – ఆయన సెన్సార్‌ బోర్డ్‌లో ఉన్నంత వరకూ తెలుగులో సినిమా తీయనని వర్మ ప్రతిజ్ఞ చేశాడు. అయితే తరవాత మాట తప్పి – అనుకోకుండా ఒక రోజు సినిమా మొదలెట్టేశాడు. అదేంటయ్యా? ఆ శర్మ ఆ బోర్డులో ఉండగా వర్మ తెలుగులో సినిమా తీయడన్నావ్‌. ఇదేంటని మీడియా అడిగితే – “నేనేమైనా సత్యహరిశ్చంద్రుణ్ణా? మీరు మాత్రం మీ జీవితంలో ఎప్పుడూ మాట తప్పలేదా? ” అంటూ ఎదురుదాడి చేశాడు. ఇచ్చిన మాట విషయంలో వర్మ ఎంత కాజువల్‌ గా ఉంటాడో తొలిసారి మీడియాకి అర్థం అయింది ఆ సందర్భంలోనే! రీసెంట్‌ గా కూడా వంగవీటి సినిమా తెలుగులో నా చివరి సినిమా అన్నాడు. ఆ మాట కూడా అతను నిలుపుకోడని అందరూ నమ్మకంగా ఉండడానికి కారణం – వర్మ మొదట్నించీ ఇస్తున్న ఇలాంటి ట్విస్టులే!

సరే. ఇప్పుడు మళ్లీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయానికొస్తే-  ఒకప్పుడు అట్టర్‌ ఫ్లాప్‌ మూవీలో వాడిన బ్యాక్‌గ్రౌండ్‌ ని సర్కార్‌ త్రీలో వాడాడాఉ వర్మ. మరి ఇప్పుడు వర్మ హిట్‌ కొడతాడా? చూద్దాం. అతనికే సెంటిమెంట్లు లేవు. మనకి మాత్రం ఎందుకు?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.