మరో తెలంగాణ సినిమా ‘ఉత్తర’


లైన్‌ ఇన్‌ సీ క్రియేషన్ అండ్ గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీరామ్, కారుణ్య హీరోహీరోయిన్లుగా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో తిరుపతి ఎస్ ఆర్, శ్రీపతి గంగదాస్‌ నిర్మాతలుగా – తిరుపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఉత్తర’.

టిల్లు వేణు, అదిరే అభి పెళ్లిచూపులు అభయ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి – ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్‌ సురేష్ యువన్‌ సంగీతాన్ని అందిస్తుండగా – అర్జున్ రెడ్డి అసోసియేట్ కెమెరామెన్ చరణ్‌బాబు సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అవుతున్నారు. సహజమైన పాత్రలు, ప్రస్తుత తెలంగాణ గ్రామీణ వాతావరణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు అవుతాయని అంటున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని రెండు పాటలకీ టీజర్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చిందని అంటున్నారు. అంతే కాకుండా ఓ పెద్ద నిర్మాణ సంస్థ దీనిని విడుదల చేయడానికి సన్నాహం చేస్తోందట. నిర్మాణానంతర కార్యక్రమంలో భాగంగా రికార్డింగ్ యూఎస్‌లో, గ్రాఫిక్స్‌ వర్క్‌ చెన్నైలో జరుగుతాయి. సినిమాని ఏప్రిల్‌లో జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu