మమ్ముట్టినీ, మోహన్‌లాల్‌నీ మించిపోయిన ప్రభాస్

SriRamaNavami

బాహుబలి తరవాత ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ ఎంతో క్రేజ్‌ తెచ్చుకుని ప్రభాస్‌ ‘ఇండియన్‌ సూపర్‌స్టార్‌’ అనిపించుకున్నాడు. అయితే ప్రభాస్‌ పేరును మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ల పేర్లకు ముందు ఇవ్వడం, స్వయంగా మలయాళ పత్రికల్లోనే అలా రావడం నిజంగా చెప్పుకోదగిన విషయం.

ఇటీవల ఏర్పడ్డ విపత్తునుంచి కేరళీయులు బయటపడడానికి సినీనటులంతా తలోచేయీ వేయడం తెలిసిన సంగతి. అందులో ప్రభాస్‌ తో బాటు – తెలుగు తమిళ మలయాళ నటులు చాలామంది ఉన్నారు. ఇటీవల ప్రముఖ మలయాళ సినీ పత్రిక ‘నాన’ లో ఈ విషయం గురించి కృతజ్ఞతలు చెబుతూ రాసిందేమిటో తెలుసా? “మహాప్రళయత్తిల్‍ ముంగియ కేరళీయరుడె దురితాశ్వాస నిధియిలేక్కు కై అయచ్చు సహాయిచ్చ ప్రియతారంగళ్కు అభినందనంగళ్‌” ( మహా విపత్తులో మునిగిన కేరళీయుల్ని ఆదుకునే సహాయనిధికి అండగా నిలిచి చేయూతనందించిన నటీనటులకు అభినందనలు! ) అంటూ రాస్తూ – ప్రభాస్, మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్, కార్తీ, సూర్య మొదలైన వాళ్లు – అంటూ క్రమంలో రాశారు. ఈ జాబితాలో మలయాళ స్టార్లకంటే ముందు ప్రభాస్‌ పేరుండడం నిజంగా ఆశ్చర్యకరమే. మొదట పేరు రాసినంత మాత్రాన ప్రభాస్‌ మమ్ముట్టినీ మోహన్‌లాల్‌నీ మించిపోయాడని కాదుగానీ… మలయాళ బాహుబలి సూపర్‌హిట్‌ కావడం, బాహుబలి తో ఇండియన్ సూపర్ స్టార్ స్థాయి సంపాదించుకోవడం – వీటితో బాటు, ప్రభాస్‌ కేరళకు ఎక్కువ సాయం ప్రకటించడం మొదలైనవి కూడా … ప్రభాస్ ఈ జాబితాలో మొదటి స్థానానికి చేరుకోడానికి కారణాలని అనుకోవచ్చు. ఏదేమైనా అక్కడి లోకల్‌ స్టార్లను మించి పేరు తెచ్చుకోవడం నిజంగా ప్రభాస్‌ ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకోదగిన విషయమే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu