భారీగా ‘సైరా’ … భారతమే ఔరా!


‘చిరు చెయ్యేస్తే చిరిగి చిరిగి చేటయిపోద్ది’ అన్నట్టు – మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక చారిత్రక సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రోజు రోజుకీ మెగా రూపం సంతరించుకుంటోంది. ఈ సినిమాని హిందీలో భారీగా విడుదల చేయడానికి – రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఎక్సెల్ మీడియా,ఎఎ ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి పనిచేయబోతోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళాలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

భారీ స్థాయిలో రూపొందిన సైరా లో భారతీయ సినిమాలోని ఎందరో ప్రముఖ నటులున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా తదితరులు నటించిన ఈ సినిమా మేకింగ్ వీడియోను ఆగస్టు 14 మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేస్తున్నారు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE