బాలీవుడ్‌కి దక్షిణాది నుంచి మరో హీరోయిన్‌!


బాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్లలో దక్షిణాదినుంచి వెళ్లినవారే ఎక్కువ. వైజయంతిమాల నుంచి హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద, అసిన్‌, ఐశ్వర్యా రాయ్‌, దీపిక వరకూ… ఇదే ట్రెండ్‌ నడుస్తోంది.  ఇప్పుడు కన్నడ హీరోయిన్‌ భావనా రావ్‌ అదే బాటలో పయనిస్తోంది. కన్నడంలో గాలిపట, వీరప్పన్‌, అట్టహాస, దయవిట్టు గమనిసి, సత్యహరిశ్చంద్ర మొదలైన చిత్రాల్లో చేసిన ఆమె ఇప్పుడు హిందీలో బైపాస్‌ రోడ్‌ అనే సినిమాకు సైన్‌ చేసిందట. నీల్‌ నితిన్‌ ముఖేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నమన్‌ నితేష్‌ దర్శకుడు.

ఈ సస్పెన్స్‌ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలయింది. కన్నడ సినిమాల్లో – డాన్స్‌లోనూ నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న భావనా రావ్‌ ప్రస్తుతం రెండు కన్నడ సినిమాల్లో నటిస్తోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu