బాబోయ్! మొబైల్ ఫోన్‌లో 1 TB మెమరీయా?

Samsung Galaxy Note 9 is the latest member of the Samsung family launched in August 2018 in India.


ఫోన్‌లో ఎంత మెమరీ కార్డు వేసుకున్నా… ఇంటర్నల్ మెమరీ ఎక్కువగా లేకపోతే యాప్స్ ఇన్‌స్టాల్ చేసేకొద్దీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత హార్డ్‌డిస్క్ పార్టిషన్ మేజిక్స్ చేసినా – ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీయే కీలకం. మొదట్లో ఈ సమస్యను గుర్తించకపోయినా – రానురాను ఇంటర్నల్ మెమరీ ప్రాధాన్యం తెలుసుకున్నాయి ఫోన్‌ కంపెనీలు. అవకాశాన్ని బట్టి ఆ మెమరీని పెంచుకుంటూ పోతున్నాయి.

మొదట్లో 4 GB, 8 GB ఇంటర్నల్ మెమరీయే గొప్ప – అనుకునే పరిస్థితి నుంచి – యాపిల్ వచ్చాక 256 GB మెమరీ వరకూ ఇంటర్నల్ మెమరీగా ఫోన్‌లో ఇవ్వడం జరుగుతోంది. యాపిల్‌ అవకాశం ఇవ్వదు గానీ- యాండ్రాయిడ్‌ ఫోన్లలో అయితే – అదనంగా మైక్రో ఎస్‌డి కార్డును కూడా జతచేసుకుని – మెమరీని మరింత పెంచుకోవచ్చు. ఈ క్రమంలో ఒక యాండ్రాయిడ్‌ మొబైల్ ఫోన్‌లో మొత్తం 1 TB మెమరీ… అంటే … దాదాపు వెయ్యి జీబీ ( 1TB = 1024 GB) ల మెమరీ కంటే ఎక్కువ మనం వాడుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ ఫోన్ మరేదో కాదు… శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9.

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ నైన్‌… ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఈ మధ్యనే మన దేశంలోకి వచ్చింది. 8 GB RAM, 512 GB ROM, 6.4 అంగుళాల తెర ఉన్న ఈ ఫోన్‌ క్రేజీ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ 512 GB. అంటే 1 TBలో సగం అన్నమాట. దీనితో పాటు మరో 512 GB మెమరీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు. అంటే కేవలం ఒక్క మొబైల్‌ ఫోన్‌లో 1 TB మెమరీ అన్నమాట. ఒకప్పుడు కంప్యూటర్లోనే 1 TB మెమొరీ అన్నది ఒక గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు మొబైల్లోనే ఆ స్థాయి మెమొరీ వచ్చేసింది. ఇది ఇంతటితో ఆగదు. హోలోగ్రఫిక్‌ స్టోరేజ్‌ లాంటి టెక్నాలజీలు అందుబాటులోకి వస్తే- భవిష్యత్తులో ఫోన్ మెమరీస్ ఏ స్థాయికి వెళ్లిపోతాయో మనం ఊహించడానికి ఈ శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 ఒక ప్రారంభం మాత్రమే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu