బాత్రూమ్‌కి ఎప్పుడు వెళ్లాలో చెప్పే పరికరం!


‘ఆదిత్య 369’ సెకండాఫ్‌ లో ఓ జోక్‌ ఉంటుంది. బ్రహ్మానందానికి ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటయ్యా ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ చెప్పడం ఏమిటి? మీకు తెలియదా? అంటే – “మాకు అంత అదృష్టం కూడానా? కంప్యూటర్‌ చెప్పినట్టు చేయాల్సిందే! ” అని జోక్‌ వేస్తాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. టాయిలెట్‌ – ముఖ్యంగా మూత్ర విసర్జనకి ఎప్పుడు వెళ్లాలో తెలియజేసే ఓ పరికరాన్ని ఈ మధ్య 2019 కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ప్రదర్శించారు. వయసుమీదపడ్డ కొందరు – మూత్రవిసర్జన విషయంలో కంట్రోల్‌ కోల్పోతారు. ముఖ్యంగా అలాంటివారికి ఉపయోగపడేందుకే దీన్ని రూపొందించారట. దీని ఖరీదు 499 డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 35 వేల రూపాయలు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu