బక్స్‌ లో తక్కువే… లుక్స్‌ లోనూ తక్కువా?

SriRamaNavami

ఆగస్ట్ నెలలో రిలీజైన Poco F1 ఫ్లాగ్ షిప్ ఫోన్‌ మంచి పేరు తెచ్చుకుంది. 6.18 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఫోన్.. ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 GB RAMతో అందరినీ ఆకట్టుకుంది. ఇంటర్నల్ మెమొరీ పరంగా 64 GB, 128 GB వెర్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు మరో 256 GBని మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా పెంచుకునేందుకు అవకాశముంది. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఖరీదు 20 వేల రేంజిలో ఉంది. అయితే అందరూ ఈ ఫోన్‌ని OnePlus 6 తో పోలుస్తున్నారు. OnePlus 6 ఫోన్‌కి పోకో F1 పోటీ ఇవ్వగలదని అంటున్నారు. OnePlus 6 లో 64 GB, 128 GB, 256 GB … మూడు వెర్షన్స్ ఉన్నాయి. ఇవి 35 వేల నుంచి 45 వేల మధ్యలో రేటు పలుకుతున్నాయి. అంత గొప్ప ఫోన్‌తో పోటీ పడగల సత్తా ఉన్న Poco F1 కేవలం 20 వేల రేంజ్‌లోనే లభించడం చాలామందికి నచ్చింది. అయితే పవర్‌ఫుల్ ఫోన్ అయినప్పటికీ, లుక్స్‌ పరంగా ఇది OnePlus 6 తో ఏమాత్రం పోటీ పడలేదని… పోకో ఫోన్‌ ని వాడుతున్నవాళ్ళు అంటున్నారు. వేగం, పనితీరు, ఫీచర్స్ పరంగా OnePlus 6 కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ – లుక్ విషయంలో OnePlus 6 చాలా గొప్పగా కనిపిస్తోందనీ, అలా కాకుండా – చీప్‌ గా ప్లాస్టిక్‌ లుక్‌ తో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా తక్కువ రేంజ్‌లో మరీ హైఎండ్ ఫీచర్స్‌తో మంచి ఫోన్‌ దొరికినప్పుడు ఆ మాత్రం సర్దుకుపోవచ్చులే – అన్నది కొందరి మాట! ఏదేమైనా – రోజురోజూ కొత్త ఫోన్‌ మోడల్స్‌ రిలీజవుతున్న నేటి తరుణంలో – ఒక ఫోన్‌ మీద మరీ ఎక్కువ ఖర్చుపెట్టడం కూడా కరెక్ట్‌ కాదు. మిడ్‌ రేంజ్‌ లో ఫోన్‌ కొనుక్కుంటే – ఏడాదికి ఒకసారి కొత్తది మార్చచ్చు, టెక్నాలజీతో అప్‌ డేట్‌ అవ్వచ్చు. ఏమంటారు?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu