ఫిబ్ర‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ ‘దేవ్’


కార్తి హీరోగా న‌టిస్తున్న ‘దేవ్’ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో విడుద‌ల కానుంది. హ‌రీష్ జ‌య‌రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కీ గిర్లానీ దేవ్ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కీ గిర్లానీ, కార్తిక్ ముత్తురామ‌న్, ఆర్జే విఘ్నేష్, రేణుక‌, అమృత‌, వంశీ, జ‌య‌కుమార్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్
నిర్మాత‌లు: S ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు
నిర్మాణ సంస్థ‌లు: ప‌్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్
స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్
సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్
సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్
ఆర్ట్: రాజీవ‌న్
ఎడిట‌ర్: రూబెన్
విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE