ప్రేమ అంత ఈజీ కాదు!


రాజేష్‌ కుమార్‌, ప్రజ్వల్‌ పూవియా జంటగా ఈశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేష్‌కుమార్‌, శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమ అంత ఈజీ కాదని చెప్పే సినిమా  ఇది.. ఇందులో ప్రేమకథ, వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఉంది’’ అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘అంతా కొత్తవారితో సినిమా తీశాం. జబర్ధస్త్‌ టీమ్‌ బాగా సహకరించారు. సోమవారంతో చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. నవంబర్‌ నెలాఖరులో లేదా, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ధనరాజ్‌
కేధార్‌ శంకర్‌, దనరాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu