ప్రెసిడెంట్ గారూ! ఏనుగుల్ని చంపేయమంటారా?


అనగనగా ఓ ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్‌ అంటే ఊరి సర్పంచ్‌ అనుకోకండి. దేశానికి ప్రెసిడెంట్. దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ మాగ్వీడ్సీ మాసిసీ (Mokgweetsi Masisi). విషయమేంటంటే మొన్నటిదాకా ఈ దేశంలో ఏనుగుల వేట మీద నిషేధం ఉండేది. ఇప్పుడీయన ఆ నిషేధం కాస్తా ఎత్తేసి ఏనుగుల్ని యథేచ్ఛగా చంపేయమంటున్నాడు.

అసలు నిషేధం ఉన్నప్పుడే రహస్యంగా కొన్ని ఏనుగుల్ని చంపేస్తూ ఉండేవారు అక్కడి జనం. 2007 నుంచి 2014 నుంచి మూడోవంతు ఏనుగులు ఇలాగే చచ్చిపోయాయట. అక్కడ వందేళ్ల క్రితం 10 లక్షలు ఉండే ఏనుగులు ఇప్పుడు నాలుగు లక్షలకి పడిపోయాయి. రాను రాను ఇంకా తగ్గిపోతున్నాయి.

పంటలు తొక్కడం, ప్రాణాలు తీయడం అనేవి కారణాలు అయినప్పటికీ – అత్యంత అరుదైన సవానా ఏనుగుల జాతిని రక్షించుకోవాల్సి ఉండగా – ఇలా నిషేధం ఎత్తేసి చంపేయమనడం ఏంటి? అని జంతుప్రేమికులు ప్రెసిడెంట్‌ గారిని ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే – రాబోయే అక్టోబర్‌లో అక్కడ ఎలక్షన్లున్నాయట. తమ అవసరాలకోసం ఏనుగుల్ని చంపేసే ఆఫ్రికన్‌ గ్రామీణుల మనసు కొల్లగొట్టడానికే శ్రీశ్రీ ప్రెసిడెంట్‌ గారు ఈ గజవధా నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకుల ఉవాచ. అదండీ! లీడర్స్‌ ఎక్కడున్నా ఒక్కలాగే ఉంటారులాగుంది!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE