పైన లైట్‍… కింద లైట్‍ మ్యూజిక్‍


అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐకియా, సోనోస్‍ రెండూ కలిసి స్మార్ట్ హోమ్‍ డివైజెస్‍ ను తయారుచేస్తున్నాయి. ఇప్పుడు వీటినుంచి ’సింఫోనిక్స్ స్మార్ట్ ల్యాంప్‍ – స్పీకర్‍’ అనే జంట డివైజ్‍ వచ్చింది. ‘ల్యాంప్‍ స్పీకర్‍’ ఏంటీ అనకండి. సోనోస్‍ వైఫై మ్యూజిక్‍ స్ట్రీమింగ్‍ టెక్నాలజీనీ, ఐకియా వారి డిజైన్‍ ఫిలాసఫీని జతపరిచి దీన్ని తయారుచేశారు.

ఒక రూమ్‍ ఆహ్లాదకరంగా ఉండాలంటే చక్కని లైటింగ్‍తో పాటు మనసుకి హాయినిచ్చే సంగీతం కూడా ఉండడం ముఖ్యం – అన్నది వీళ్ల ఐడియా. అందుకే ఓ టేబుల్‍ ల్యాంప్‍ కింద వైర్‍లెస్‍ స్పీకర్‍ ని బిగించి – ఈ ’ల్యాంప్‍ స్పీకర్‍’ ని తయారుచేశారు. చూడ్డానికి పెద్ద ఇయర్‍ ఫోన్‍ ఆకారంలో ఉండే ఈ జంట డివైజ్‍ మార్కెట్లో మంచి సక్సెస్‍ అవుతుందని అంటున్నారు. అయితే మరి దీని ఖరీదెంతో తెలుసా? దాదాపు 180 డాలర్లు. అంటే పన్నెండున్నర వేల రూపాయలు!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu