పెట్రో బంద్‌ ఫెయిలయ్యిందా ఏంటి?

SriRamaNavami

పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ కిందికి తీసుకురావాలంటూ కాంగ్రెస్ సోమవారం పెద్ద ఎత్తున బంద్ తలపెట్టిందన్నది తెలిసిందే. అయితే, ఈ బంద్ విజయవంతం అయ్యిందా… లేదా? అంటే.. చాలా తక్కువగానే విజయం సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. పెట్రోల్ రేట్లు పెరగడంలో మా తప్పేం లేదన్నట్లు కేంద్రం మాట్లాడినప్పటికీ, కచ్చితంగా కేంద్రం తప్పే అన్నట్టుగా ఓ వర్గం మీడియా చెబుతోంది. క్రూడాయిల్‌ రేట్లు తగ్గుతున్నా – పెట్రోల్‌ రేటు పెరుగుతుండడమే ఇందుకు కారణం.
ఆంధ్రాలో కొన్ని చోట్ల బంద్ బాగా విజయవంతం అయినప్పటికీ – తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో బంద్ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పాలి. పెట్రోల్ రేట్లు పెరగడం నిత్యజీవనం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపే విషయం కాబట్టి, దేని విషయంలోనైనా రాజకీయ పార్టీలు అలక్ష్యంగా ఉంటాయేమో గానీ పెట్రో రేట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తుంటాయి. చిత్రం ఏమిటంటే – ఏకంగా 21 పార్టీలు ఈ పెట్రో రేట్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయని కాంగ్రెస్ చెప్పుకున్నప్పటికీ, సామాన్యజనంలో ఆ స్థాయి వ్యతిరేకత ఏదీ కనిపించలేదు. బీహార్, కర్ణాటక లాంటి కొన్నిచోట్ల, గుజరాత్ లోని కొన్నిచోట్ల ఏపీలోనూ తప్ప మిగిలినచోట్ల బంద్ ప్రభావం పెద్దగా లేకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకూ రూ.70 ఉండే పెట్రోలు రూ.80, రూ.90 ఇలా రూ.100కు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ సామాన్య జనం దీనిపైన అంత ప్రతికూలంగా ప్రతిస్పందించకపోవడం విశేషమేనని చెప్పాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu