పిల్లలకోసం ఓ క్షేమకరమైన సోషల్‌ నెట్‌వర్క్?

SriRamaNavami

పెద్ద వాళ్లు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కులు తెగ వాడుతూ ఉంటారు. కానీ అదే పిల్లలు వాడితే తిడతారు. ఎందుకంటే – అవన్నీ అంత క్షేమకరమైనవి కాదు కాబట్టి! అసలు ఫేస్‌బుక్‌ లాంటివాటిలో పదమూడేళ్ల పిల్లలకి ప్రవేశమే లేదు. కానీ సరదా కొద్దీ- షేరింగ్‌ అంటే ఉన్న ఆసక్తి కొద్దీ పిల్లలు సోషల్‌ నెట్‌వర్క్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆన్‌లైన్‌ అంటేనే తెలియని ఈ పిల్లలు తెలిసీ తెలియని ఆ వయసులో – వయసు సమాచారాన్ని తప్పుగా ఇచ్చి – ఫేస్‌బుక్‌ అకౌంట్లు తీసుకుని దాన్ని ఆటగా వాడుతూ ఉంటారు. అయితే తెలిసీ తెలియకవాడితే ఇంటర్‌నెట్‌ ప్రమాదకరమైనది. ఫేస్‌బుక్‌లో అపరిచితులతో పరిచయం పెంచుకోవడం, తరవాత వాళ్లు వీళ్లని బాధించడం, బెదిరించడం – తల్లితండ్రులకి చెప్పుకోలేక పిల్లలు ఎంతో మానసిక క్షోభకి గురికావడం – ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి.

అందుకే ఇప్పుడు పిల్లలకోసం ప్రత్యేకించిన సోషల్‌ నెట్‌వర్కులు – Yoursphere , GromSocial , Kidzworld, Club Penguin లాంటివి కొన్ని వస్తున్నాయి. ఈమధ్య లెగో సంస్థవాళ్లు కూడా లెగోలైఫ్‌ అనే సోషల్‌ నెట్‌ వర్క్‌ని ప్రారంభించారు. ఇది మొబైల్‌ యాప్‌ రూపంలో లభిస్తోంది. పిల్లలు తమ ఒరిజినల్‌ ఐడెంటిటీని ఇవ్వకుండా ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ని భద్రంగా వాడుకోవచ్చని ఈ సంస్థవాళ్లు అంటున్నారు. లెగో అంటే మరేదో కాదు. లెగో స్టార్‌వార్స్‌ లాంటి గేమ్స్‌ పిల్లలకి పరిచయమే. లెగో అన్నది దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం పిల్లల బ్రిక్‌ గేమ్‌ గా మొదలయింది. అంటే – బిల్డింగ్‌ బ్లాక్స్‌ మాదిరిగా ఒకదాన్నొకటి అతుకుతూ రూపాలు తయారుచేసే ప్లాస్టిక్‌ బ్లాక్స్‌ తో లెగో సంస్థ ఎంతో పేరు తెచ్చుకుంది. పిల్లల గేమ్స్‌ లో ఇప్పటికీ లెగో అంటే ఎంతో క్రేజ్‌ ఉంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.