పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగులు ఎందుకు చెప్పడం లేదు?

SriRamaNavami

స్టార్ నుంచి లీడర్‌గా ఎదుగుతున్నప్పటికీ – తన రాజకీయ సమావేశాల్లోకి అసందర్భంగా సినిమాను తీసుకురాకపోవడం పవన్ కల్యాణ్ విజ్ఞతకు నిదర్శనం. సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకు అవగాహన ఉండదని అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే – సినిమా నుంచి రాజకీయాల్లోకి ఏదో అలా వచ్చి వెళ్ళి పోయినవాళ్ళే ఎక్కువ. విజయాలు సాధించినవారి సంఖ్య చాలా తక్కువ. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తనను తాను ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టుకోవాలనీ నిరూపించుకోవాలనీ అనుకుంటున్నారు. ఆయనకు నాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కూడా! దానికి మొట్టమొదటి రుజువు… ఆయన తన పబ్లిక్ మీటింగ్స్‌లో సినిమా డైలాగ్స్‌ను ఎంతమాత్రం వాడకపోవడం. ఎప్పడైనా సందర్భాన్ని బట్టి ఒకటీ అరా కొన్ని సినిమాల్లోని పాటల్ని మాత్రం ఆయన ప్రస్తావిస్తున్నారు. అది కూడా దేశభక్తికి సంబంధించినవి, ప్రజా జీవితానికి సంబంధించినవి మాత్రమే ఆయన చెబుతున్నారు. అంతేగానీ “నాకు కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది”, నేను ట్రెండ్‌ ఫాలో అవను, ట్రెండ్ మారుస్తా… లాంటి సినిమా స్థాయి డైలాగుల్ని ఆయన మీటింగుల్లో చెప్పడం లేదు. ఇది ఆయనకున్న రాజకీయ పరిణతిని సూచిస్తుంది.

నిజానికి పవన్ కల్యాణ్ తన పొలిటికల్‌ మీటింగుల్లో తన సినిమాల్లోని కొన్ని క్రేజీ డైలాగ్స్ చెబితే జనం కచ్చితంగా ఈలలు వేస్తారు, ఆయనకు నీరాజనాలు పడతారు. ఆ విషయం తెలిసిందే! కానీ అలా తెచ్చుకునే క్రేజ్‌ కొద్ది కాలమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కేవలం కొన్ని మీటింగుల వరకే ఆ డైలాగులు చెలామణీ అవుతాయి. నిజంగా ప్రజాసమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు ఇలాంటి చిల్లర క్రేజీ విషయాలు తగ్గించుకుని సీరియస్‌గా ప్రజా స్వామ్యం వైపు వెళ్ళాలి. అప్పుడే ఆయన ప్రజల గుండెల్లో నాయకుడిగా స్థానం ఏర్పరుచుకోగలుగుతారు. ఈ విషయం పట్ల అవగాహన ఉండటం వల్లే – పవన్ పరిణతితో వ్యవహరిస్తున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిజమే కదా? ఈ రోజు ఏదో నాలుగు సినిమా డైలాగులు చెప్పి, నాలుగు చప్పట్లు కొట్టించుకున్నా… అది దీర్ఘకాలంలో నాయకత్వాన్ని పొందడానికి ఆయనకు అవి పెద్దగా ఉపయోగపడవు. పైగా అతను కేవలం హీరో మాత్రమే అనే భావానికి జనాన్ని పరిమితం చేస్తాయి. పవన్‌ ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా తాను ఉండాలనుకుంటున్నారు. అలాగే తనని జనం చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టే జనంలోంచి ఎంతో రెస్పాన్స్‌ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ – చిల్లర సినిమా డైలాగుల జోలికి పోవడం లేదు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu