నాగచైతన్య, సమంత విడాకులట ! ఎంత ఘోరం!

SriRamaNavami
Samantha Divorce Gossips in Tamil Magazines!

ప్రభాస్ లాంటి హీరో విషయంలో అతని పెళ్లి గురించి – అతనికంటే ఎక్కువగా అభిమానులు తొందర పడుతూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు? పెళ్లి ఎప్పుడు? – అని వాళ్ల వ్యక్తిగత జీవితం లోకి వెళ్లి మరీ ఇబ్బంది పెడుతుంటారు. కొందరు ఇంకా ముందుకి పోయి – ఎవరిని చేసుకోవాలో కూడా వాళ్లే చెబుతారు. అదే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటే మాత్రం బాధపడిపోతారు. బాధపడి ఊరుకుంటే ఓకే. కానీ ఎప్పుడు విడిపోతుందా అన్నట్టు ఎదురుచూస్తుంటారు. పైకి బావుందన్నప్పటికీ – ఏ హీరోయిన్‌ పెళ్లి ఎప్పుడు పెటాకులవుతుందా అన్నట్టు ఉంటారు. ఇది మంచి సంస్కారం కాదు. నిజంగా చెప్పాలంటే – ఓ మానసిక దౌర్బల్యం. ఈ దౌర్బల్యాన్ని మీడియా క్యాష్‌ చేసుకుంటూ ఉంటుంది.

ఈ మధ్య సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. హాయిగా ఉన్నారు. అయితే పెళ్లి అయిన తరవాత కూడా సమంత నటించడం కొనసాగిస్తోంది. ‘రంగస్థలం’ లో సమంత కొంత హద్దులుమీరి నటించిందన్నది నిజం. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నితమిళ పత్రికలు కథలు అల్లడం ప్రారంభించాయి. సినీకూత్తు, వణ్ణత్తిరై లాంటి కొన్ని తమిళ సినీ పత్రికలు పూర్తిగా సినిమా గాసిప్స్‌ మీదే బతుకుతుంటాయి. వీటిలో సినీకూత్తు అనే పత్రిక మొన్న జూన్లో వచ్చిన ఓ సంచికలో సమంత నాగచైతన్య నుంచి విడిపోతోంది అంటూ ప్రముఖంగా ప్రచురించింది. అది చదివిన ఎవరైనా – “అయితే రేపో మాపో నాగచైతన్య, సమంత విడాకులు ఇచ్చేసుకుంటున్నారన్నమాట! ” – అని అనుకోవడం ఖాయం. ఆ స్థాయిలో రాసింది సినీకూత్తు పత్రిక. సమంతని నాగచైతన్యకి ఏదో అన్నాడనీ, అసలు సమంత నటించడం నాగార్జునకి ఇష్టం లేదనీ, ఈ కోపంతోనే ‘రంగస్థలం’ మూవీలో రెచ్చిపోయి నటించిందనీ .. ఇలా రకరకాలుగా తమిళ పత్రికలు రాశాయి. తీరా చూస్తే – ఇక్కడ సమంత హాయిగా నటిస్తూనే ఉంది. రాజుగారి మహానటిలాంటి హిట్స్‌ కొడుతూనే ఉంది. తమిళ సినిమా ‘ఇరుంబు తిరై’ తెలుగులో కూడా ‘అభిమన్యుడు’ పేరుతో హిట్‌ అయింది. మామగారయిన నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది 2 కూడా మంచి పేరే తెచ్చుకుంది. పైగా ఈ మధ్యనే – సమంత సినిమాలు చేస్తూనే ఉంటుందని తనకి అభ్యంతరం లేదని స్వయంగా నాగచైతన్యే చెప్పడం జరిగింది. ఎంత గాసిప్స్ రాసుకుని బతికితే మాత్రం – మరీ ఒక స్థాయికి దిగి జీవితాలను పాడు చేసే విధంగా రాయడం మంచి సంస్కృతి కాదు. ఇది ఎన్ని సార్లు చెప్పినా మీడియా వింటుందన్న గ్యారంటీ కూడా లేదు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu