నంబర్‌ వన్‌ కష్టజీవి ఈ అమ్మాయేనట!

SriRamaNavami

ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ప్రపంచంలో అతి ఎక్కువగా కష్టపడుతున్న అమ్మాయి తనే! అరియానా గ్రాండె. అమెరికన్‌ సింగర్‌, యాక్టర్. వయసు కేవలం 23. మరి ఇంత తక్కువ వయసులో ప్రపంచంలోనే అతి ఎక్కువగా కష్టపడుతున్న వ్యక్తి అరియానా మాత్రమే! ఏంటి నమ్మట్లేదా? నమ్మాలండి బాబూ! ఇంతకీ ఈ విషయం చెప్పిందెవరంటారా? ఎవరో అయితే మేం ఎందుకు నమ్ముతాం? సాక్షాత్తూ అరియానాయే చెప్పింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లో తనమీద తనే ఇలా రాసుకుంది. అందమైన అమ్మాయి కాబట్టి – అరియానాకి విపరీతమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే – తన కష్టం గురించీ శ్రమ గురించి తనని తనే పొగిడేసుకున్న ఈమె కామెంట్స్‌ చూసి ఫ్యాన్స్‌ తో సహా అంతా అవాక్కయిపోయారు. ఆడిపోసుకుంటున్నారు. . ఒకోసారి రికార్డింగ్‌ కి వచ్చినప్పుడు నడవడం కూడా నడవదట! ఎత్తుకుని రికార్డింగ్‌ స్టూడియోకి తీసుకెళ్లమని చిన్నపిల్లలా పేచీ పెట్టిన సందర్భాలూ చాలా ఉన్నాయట. అందమైన అమ్మాయి కాబట్టి – ఎత్తుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? అయితే ఇక్కడ అభ్యంతరం అన్నది విషయం కాదు. స్టూడియోలోకి నడవడానికే బద్ధకించే అమ్మాయి ప్రపంచంలోనే తెగ కష్టపడే వ్యక్తిని నేను అంటే… మరి నవ్వులాటగా ఉండదూ? ఏమో! పాపం … నిజంగానే అరియానా విపరీతంగా కష్టపడిపోతోందేమో! ఎవరికి తెలుసు?

నిత్యం పాటలతో డ్యాన్స్‌ లతో తెగ కష్టపడిపోతోందట. నిజంగా అమెరికాలో యువత ఎంత కష్టపడుతోందనడానికి – ఈ అమ్మాయినే ఉదాహరణగా చెప్పుకోవాలేమో! మేమయితే నమ్మడానికి రెడీ! రెడీ ఏంటి? నమ్మేస్తున్నాం. ! – అంటున్నారు కొందరు. అవును… అందమైన అమ్మాయి అబద్ధం చెప్పినా అందంగానే ఉంటుంది కదా మరి?

అరియానా గ్రాండె వీడియో ఇక్కడ చూడండి :

The hardest Working Girl on Earth?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.