దీదీ మాటలు బాబుకు తగలడం లేదు కద?


చంద్రబాబుతో కలిసి రాజకీయపుటెత్తుగడలు వేస్తున్నారు దీదీ మమతా బెనర్జీ. అయితే మోదీకి వ్యతిరేకంగా ఆమె వదులుతున్న మాటల తూటాలు ఆమె అస్మదీయుడిగా భావిస్తున్న చంద్రబాబుకి కూడా పరోక్షంగా తగులుతున్నాయేమోనని ఆమె ఆలోచించుకోవడం అవసరం.

“మోదీ నెగ్గుతారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గాసిప్స్” – అని మమతా బెనర్జీ కొట్టిపడేశారు. ఈ గాసిప్స్‌ని బాగా వ్యాప్తి చెందించి, ఆ సమయంలో ఈవీఎంలను భారీగా తరలించే కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందువల్ల ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉండి ఈ కుట్రను భగ్నం చెయ్యాలని ఆమె చెప్పారు.

అయితే, దీదీ మాటల్ని బట్టి సామాన్యుడికి అర్థమయ్యేదేమిటి? అధికార పార్టీ నెగ్గుతుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా చెప్పిస్తే- ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని ఈవీఎంలను తరలించే అవకాశముందా? అవుననే ఆమె మాటల్ని బట్టి అనుకోవాల్సి వస్తుంది. అలా అనుకుంటే – ఇక్కడ ఏపీలో జరుగుతున్నదేమిటి? ఇక్కడ కూడా అధికార పార్టీవారే తాము అద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నామని సర్వేల్లో చెప్పిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి, ఈవీఎంల తరలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం గురించి భయపడుతూ ఇక్కడి ప్రతిపక్షాలు కూడా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరముందా? అన్నది మమతా బెనర్జీయే చెప్పాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu