తనీష్‌ తగ్గడం లేదు… మరో సినిమా ‘మహాప్రస్థానం’


మహాకవి శ్రీశ్రీ రాసిన మహాకావ్యం మహాప్రస్థానం. చాలా గొప్పది. సినిమాకి గొప్ప పేరు పెట్టారు. కానీ ప్రాబ్లెమ్‌ ఏంటంటే – గొప్ప తత్వజ్ఞానం బోధించే భగవద్గీతని – మనుషులు పోయినప్పుడు మాత్రమే ప్లే చేస్తూ – దానికి వేరే ఇమేజ్‌ ఇచ్చినట్టు – ఈ మధ్య ‘మహా ప్రస్థానం’ అన్నదాన్ని కూడా మనిషి అంతం అయ్యే సందర్భంలో వాడుతున్నారు. బాబూ తనీష్‌! ఈ టైటిల్‌ చూస్తుంటే నీ కెరీర్‌ నువ్వే అంతం చేసుకుంటున్నావా అనిపిస్తోంది. అసలే శరీరం కంట్రోల్లో లేదు.. కెరీర్‌ చేతుల్లో లేదు.. ఏంటో పాపం ఇతని భవిష్యత్తు!

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. అంతకుమించి లాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు జాని, తన రెండో చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ మహాప్రస్థానం చిత్రాన్ని నిర్మిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో మహాప్రస్థానం సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ తొలివారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా.

ఈ చిత్రం గురించి దర్శకుడు జాని మాట్లాడుతూ…ఇదొక యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమ కథకు తనీష్ సరిగ్గా సరిపోతారు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో మనల్ని లీనం చేస్తుంది. డిసెంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. నిరవధికంగా షూటింగ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. అన్నారు.

ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., ఫైట్స్ – శివ ప్రేమ్, సంగీతం – సునీల్ కశ్యప్, సిినిమాటోగ్రఫీ – MN బాల, కథా కథనం దర్శకత్వం – జాని

61 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE