డ్యూయల్‍ రోల్‍.. డబుల్‍ రోల్‍.. సినిమా కాదిది ఫోన్‍!

ఫోన్‍ స్క్రీన్‍ పెద్దగా ఉండాలి. కానీ ఫోన్‍ మాత్రం మరీ పెద్దగా ఉంటే ఇబ్బంది. మరి ఈ సమస్యకి పరిష్కారం? ఫోల్డబుల్‍ ఫోన్‍. ఓ కాగితాన్ని మడతపెట్టినట్టు – ఫోన్‍ని మడతపెట్టేయగలిగితే – అటు స్పేసూ కలిసొస్తుంది. ఇటు స్క్రీనూ పెద్దదిగా ఉంటుంది.

శామ్‍సంగ్‍ ఈ మధ్య ’గెలాక్సీ ఫోల్డ్‌’ అనే ఫోన్‍ వస్తున్నట్టు ప్రకటించింది. రెండు స్క్రీన్స్‌ని ఒక్కటిగా మధ్యకి మడతపెట్టే ఆ వెరైటీ డిస్‍ప్లే ఫోన్‍ కోసం శామ్‍సంగ్‍ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శామ్‍సంగ్‍, హ్యువావీ తరవాత – ఎట్జీ కూడా ఫోల్డబుల్‍ ఫోన్‍ తయారుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఫోన్‍ కేవలం మడతపెట్టడం కాదు, కాగితం చుట్టినట్టు చుట్టేయగలిగే ఫోన్‍. ఇందువల్ల పెద్ద స్క్రీన్‍ ఉన్న ఫోన్‍ కూడా చిన్నగా మారిపోయి – తక్కువ స్పేస్‍లో పట్టేస్తుంది.

సో.. ఈ కొత్త ఫోన్స్‍ని ’ఫోల్డబుల్‍ ఫోన్స్‌’ అనడం కాదు, ’రోలబుల్‍ ఫోన్స్‌’ అనడం కరెక్ట్‌. ఈ ఫోన్‍ మోడల్స్‌కి పెట్టడానికి పది పేర్లని రిజిస్టర్‍ చేసిందట ఎల్జీ. రోల్‍, డబుల్‍ రోల్‍, సిగ్నేచర్‍ ఆర్‍, ఆర్‍ స్క్రీన్‍, ఆర్‍ కాన్వాస్‍, డ్యూయల్‍ రోల్‍, రోల్‍ కాన్వాస్‍, బై రోల్‍, రోటోలో – ఈ పేర్లతో ఏ పేర్లు వాడతారో ఏవి ముందు వస్తాయో గానీ… రాబోయే రోలబుల్‍ ఫోన్స్‌ కచ్చితంగా పెద్ద ట్రెండ్‍ క్రియేట్‍ చేస్తాయనిపిస్తోంది.

This post is also available in: ఇంగ్లిష్‌