‘చూసీ చూడంగానే’ ఫస్ట్ లుక్‌ రిలీజ్


శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చూసీ చూడంగానే’. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో శివ కందుకూరి పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆగస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంట‌ల్ మ‌దిలో’ కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
శివ కందుకూరి, వ‌ర్ష బొల్ల‌మ్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

డైరెక్ట‌ర్: శేష సింధు రావు

నిర్మాత: రాజ్ కందుకూరి

బ్యాన‌ర్‌: థ‌ర్మప‌థ క్రియేష‌న్స్‌

స‌మ‌ర్ప‌ణ‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌

డైలాగ్స్‌: ప‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌

ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజాల‌

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu