చిటికెలో వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌ రెడీ!

SriRamaNavami

ఫొటోల్ని ఆర్ట్‌ వర్క్‌లా మార్చడం ఇప్పుడు పెద్ద కష్టమైన పని కాదు. ఫొటోషాప్‌లాంటి సాఫ్ట్‌వేర్లలో ఫిల్టర్స్‌ వేసేసి ఏ ఫొటోనయినా ఆర్ట్‌ అని నమ్మించవచ్చు. కానీ మొబైల్‌లోనే ఆ పని చేసిపెట్టగలిగే యాప్స్‌ కి ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. ఫొటోని ఒక డ్రాయింగ్‌లాగా, పెయింటింగ్‌లాగా మార్చగలిగే యాప్స్‌ చాలా వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే నిజమైన ఎఫెక్ట్‌ చూపించగలుగుతాయి. నిజంగా వాటర్‌ కలర్‌ పెయింట్‌ వేశారా అన్నట్టు అనిపించే యాప్‌ ఈ మధ్య వచ్చింది. దాని పేరు పోర్ట్రా (Portra).

ఈ యాప్‌లో ఎన్నో కలర్‌ ఫిల్టర్స్‌ ఉంటాయి. అయితే ఫొటో చుట్టూ ఫ్రేమ్‌ కనిపించకుండా కలర్స్‌తో జిగ్‌జాగ్‌ ఎఫెక్ట్‌ ఈ యాప్‌ స్పెషాలిటీ! దీనివల్ల ఫొటోని పెయింటింగ్‌ గా మార్చినప్పుడు – అది నిజంగా వాటర్‌ కలర్‌ పెయింటింగే అని నమ్మేలా ఉంటుంది. ప్రో వెర్షన్లో మరిన్ని ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అయితే అది సబ్‌స్క్రిప్షన్‌ కాబట్టి రికరింగ్‌ ఖర్చు… ! ప్రతి నెలా పే చేయడం కష్టం. ఏమైనా పోర్ట్రా యాప్‌ పని తీరు బాగుంది. యాప్‌ ఉంది కదా అని – మరీ ప్రతి ఇమేజ్‌నీ పెయింటింగ్‌ చేసేయాలని అనుకోకుండా – పెయింటింగ్‌కి సూటయ్యే ఇమేజెస్‌ సెలక్ట్‌ చేసుకుంటే – పోర్ట్రా యాప్‌తో మంచి ఆర్ట్‌ ని సృష్టించడం – చిటికెల మీద పని!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu