గోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి!


మనకున్న మంచి నటుల్లో గోపీచంద్‌ ఒకడు. మొదట్లో విలన్‌ లుక్‌ ఉన్నా క్రమంగా హీరోగా ఆకట్టుకున్నాడు. అసలు మన టాప్‌ స్టార్స్‌ చాలామంది మొదట విలన్‌గా వచ్చి తరవాత హీరోగా సక్సెస్‌ అయినవాళ్లే! కాబట్టి ఆ విషయం ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్య కొన్ని సినిమాల్లో గోపి నీరసంగా కనిపిస్తున్నాడు. ఆ లుక్‌ మీద అతను శ్రద్ధపెడితే బాగుంటుంది.

గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర
నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మూవీ మేకర్స్ పాటలను
విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE