క్లినిక్‌ దగ్గర క్లిక్‌ !… జాహ్నవి పరువు తీసిన మీడియా

SriRamaNavami

“శ్రీదేవి కూతురు జాహ్నవి నిన్న ఒక క్లినిక్ ముందర కనిపించింది” అంటూ ఒక వెబ్‌ సైట్ దాన్ని ఒక ప్రముఖ వార్తగా ప్రచురించింది. హీరోయిన్లు క్లినిక్ దగ్గర కనిపించకూడదు, వాళ్లకి జబ్బు చేయకూడదు, జలుబు చేయకూడదు” – ఇవన్నీ మన మీడియా రూల్స్.
కానీ పాపం కొత్త హీరోయిన్ కదా, ఈ విషయాలేవీ జాహ్నవికి తెలియదులాగా ఉంది అందుకే ముంబాయిలోని జుహులో ఒక క్లినిక్‌ పరిసరాల్లో నుంచుని జాహ్నవి కనిపించింది. క్లిక్‌ కి దొరికిపోయింది. నిజానికి జాహ్నవి ఈ ఫొటోల్లో ఎంతో మామూలుగా ఉంది. ఫుట్‌ పాత్‌ లా ఉన్నచోట- బ్యాడ్‌ స్మెల్‌ ఉందిలా ఉంది.. భరించలేక ముక్కు మూసుకుని కాస్త విసుగ్గా ఫేస్‌ పెట్టింది. మరో ఫొటోలో – పైనున్న షర్ట్‌ ని బ్యాగ్‌లో పెట్టుకుని … నవ్వుతూ ఫోన్‌ చెక్‌ చేసుకుంటోంది. ఆ మాత్రం దానికే ఆ వెబ్‌ సైట్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. జాహ్నవి ఏదో పెద్ద తప్పు చేసేసినట్టూ, తమకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టూ – ఆ ఫొటోని ప్రముఖంగా ప్రచురించింది. చిత్రమేమిటంటే ఆ వార్త రాసినది కూడా ఒక అమ్మాయే! ఆమె పేరు కూడా జాహ్నవే! జాహ్నవి పటేల్!

పాపా జాహ్నవి పటేల్! నిన్నే!

జాహ్నవి కూడా తోటి అమ్మాయే కదా? ఆమె సెలబ్రిటీ కావడమే మీకు ఇబ్బందా?  సెలబ్రిటీల గురించిన సామాన్య విషయాలు కూాడా జనం చదువుతారు. కానీ ఒక సామాన్య విషయాన్ని ఈ కోణంలో ఇలాగా ప్రకటించడం? ఆమె క్లినిక్‌ దగ్గర ఎందుకుంది? ఎవరో ఫ్రెండ్‌ని చూడడానికి వచ్చి ఉండొచ్చు లేదా అక్కడ క్లినిక్‌ ఉందని గమనించక – రోడ్డుపక్క ఏదో పనిమీద నిలుచుని ఉండొచ్చు. కానీ అక్కడ కనిపించినంత మాత్రాన ఒక క్షణంలోనే క్లిక్ చేయాలా? క్లిక్‌ చేయడం ఓకే. అనుమానాలు రేకెత్తించేలా అసభ్యంగా రాయాలా?

పాపా జాహ్నవీ కపూర్‌! నీకే చెప్పేది!

నువ్వు కొత్తగా ఈ సినిమాలోకం లోకి వచ్చావు మనం డిగ్నిఫైడ్‌ జర్నలిజం రోజులనుంచి దిగజారుడు జర్నలిజం రోజులలో కి వచ్చాం. సెలబ్రిటీ అయిన నువ్వు మొట్టమొదట ఈ విషయం గుర్తించాలి. హీరోయిన్లు పబ్లిక్‌ లో కనిపిస్తే – ఏదో చీరల షాపు, నగల షాపు ఓపెనింగ్‌ లో కనిపించాలి గానీ.. పబ్బులోనూ క్లినిక్‌ దగ్గరా కాదు. అది మీడియా రూలు. అలా కనిపిస్తే ఆటాడుకుంటారు. ఇలాంటి నాలుగు ఛాన్సులు దొరికితే – జాలిలేని జర్నలిస్టులు నీ కెరీర్‌నే సమాధి చేయగలుగుతారు. అదృష్టవశాత్తూ ‘ధడక్’ సినిమాతో హిట్‌మీద ఉన్నావ్. తొలిరోజుల్లోనే నీకు మీడియావాళ్లు దడ పుట్టించకుండా చూసుకో. కొంచెం జాగ్రత్తలు తీసుకో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu