క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌


చిరంజీవి మెగాస్టార్‌ కావడంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ పాత్ర కూడా ఎంతో ఉంది. అభిలాష, ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణమృదంగం లాంటి మ్యూజికల్‌ హిట్స్‌ వారి ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్థ ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తోంది. క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క‌్రాంతి మాధ‌వ్
స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు
నిర్మాత‌: కేఎ వ‌ల్ల‌భ‌
నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్
సంగీతం: గోపీసుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫర్: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu