క్రియేటివ్ కమర్షియల్స్‌లో విజయ్ దేవరకొండ, కేథరిన్

SriRamaNavami

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా లో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది..
గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జే కే సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, కేథరీన్ తెరిస్సా తదితరులు

సాంకేతిక నిపుణులు :
రచయిత & దర్శకుడు : క్రాంతి మాధవ్
సమర్పణ : కేఎస్ రామా రావు
నిర్మాత: కె.ఎ. వల్లభ
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
సంగీతం: గోపి సుందర్
డిఓపి : జే కే
ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu