కాంగ్రెస్‌ చేసిన ఆ తప్పే కేసీఆర్‌ కి ఆయుధమా?

SriRamaNavami

కేసీఆర్‌ జోరుగా ఎలక్షన్‌ ప్రచారం ప్రారంభించారు. వస్తూ వస్తూనే ఆయన ప్రతిపక్షాల మీద ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఇది ఊహించిందే! అయితే కేసీఆర్‌ తన ఉపన్యాసం అంతటా చంద్రబాబుని ఆడిపోసుకోవడమే కనిపించింది. చంద్రబాబుపై విమర్శల్నే ఆయన ముఖ్యమైన ఆయుధంగా చేసుకున్నారు. చంద్రబాబుపై కేసీఆర్‌కి ఉన్న విముఖత కారణంగా- ఇది సహజమైన విషయమేనని అనుకోవచ్చు. కానీ – ఇందువల్ల కాంగ్రెస్‌ వాళ్లు కేసీఆర్‌ పై లేవనెత్తే పాయింట్స్‌ బలహీనపడిపోతున్నాయి. వాటికి సమాధానం చెప్పకుండా కేసీఆర్‌ ఎంతో సులువుగా తప్పించుకోగలుగుతున్నారు. పైపెచ్చు వీరినే విమర్శలతో చెండాడగలుగుతున్నారు. చంద్రబాబుతో వీరి మిత్రత్వమే ఆయనకి ఆ వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా ఉంది.

కేసీఆర్‌ ఉపన్యాసం తరవాత తెలంగాణ కాంగ్రెస్‌లో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపన్యాసంలో అడుగడుగునా కేసీఆర్‌ తెలుగుదేశాన్నీ ఆంధ్రా పెత్తనాన్నీ తిట్టిపోస్తూ వచ్చారు. చంద్రబాబుని ఆంధ్రా రాక్షసిగా అభివర్ణించారు. ఇవన్నీ ఎప్పుడూ ఊహించేవే అయినప్పటికీ – ఈ గోల మధ్య అసలు – కేసీఆర్‌కి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌వాళ్లు లేవనెత్తిన విమర్శలన్నీ చర్చకే రాకుండా పోతున్నాయి. ఎంతసేపూ చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి, ఓటుకు నోటు కేసు… అంటూ తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌ ఉపన్యాసం సాగింది. పైగా -కూటమికి ఓటేస్తే మళ్లీ తెలంగాణను ఆంధ్రా పాలకుల చేతిలో పెట్టినట్టే – అన్నట్టు కేసీఆర్‌ మాట్లాడారు.
కేసీఆర్‌ ఉపన్యాసం తీరు చూశాక – తెలుగుదేశంతో జత కట్టడమే తెలంగాణలో కాంగ్రెస్‌ చేసిన పెద్ద తప్పిదమా? అనే మీమాంసలో మహాకూటమి పడినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబుతో సంబంధం లేకుండా ఉండి ఉంటే – కేసీఆర్‌ కనీసం తమ విమర్శలకి సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవారనీ, ఆ తరవాత కేసీఆర్‌ వ్యతిరేకవాణిని జనంలో తాము గట్టిగా వినిపించి ఉండేవారమనీ వాళ్లు అంటున్నారు. అయితే చంద్రబాబుతో ఏర్పాటు చేసుకున్న పొత్తు వల్ల – చంద్రబాబు పొరబాట్లన్నీ తమకి వచ్చి తగులుకుని – కొన్ని పాయింట్ల విషయంలో నోరెత్తలేని పరిస్థితి ఏర్పడుతోందని వాళ్లు వాపోతున్నారు.

నిజమే కావచ్చు. అయితే మరి పొత్తు పెట్టుకునే ముందే తెలంగాణకాంగ్రెస్‌ నేతలు ఇవన్నీ ఆలోచించుకోలేదా? మరి రాబోయే సమావేశాల్లో కూడా – కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతల దుమ్ము దులపడానికి- చంద్రబాబునే ఆధారంగా చేసుకుంటారని సులువుగా ఊహించవచ్చు. దీనికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధపడి ఉండాలి. అయినా – చేతులు కాలాక ఇప్పుడు చంద్రబాబుని తిట్టుకుని ఏం లాభం?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.