కన్నుమూయనివ్వని కళ్లజోడు!


ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఎల్సీ హెల్దీ ( Ellcie Healthy ) అనే సంస్థ – కునికిపాట్లు పడే డ్రైవర్లని నిద్రలేపే ఓ స్మార్ట్‌ కళ్లజోడు తయారుచేసింది. కళ్లు మూసుకుని ఉంటే – ఈ కళ్లజోడు ముఖం మీదకి కాంతిని ప్రసరింపజేసి మెలకువ తెచ్చేస్తుంది. మామూలుగా కూడా కళ్లు రెప్పలార్పేంత సమయం అయితే ఓకే. అంతకంటే ఎక్కువ సేపు కళ్లు మూతపడితే మాత్రం ఈ కళ్లజోడునించి హెచ్చరికలు మొదలయిపోతాయి. అంతేకాదు, ఈ కళ్లజోడు ఒక యాప్‌ ద్వారా మన ఫోన్‌కి కనెక్టయి అలార్మ్‌ కూడా మోగిస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయని కంపెనీవాళ్లు చెబుతున్నారు. దీని ఖరీదు 250 డాలర్లు. మన కరెన్సీలో 17 వేల రూపాయల పైమాటే!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE