ఓటరు జాబితాల్లో మరీ లక్షల అవకతవకలా?

SriRamaNavami

కాంగ్రెస్‌ నేత ఒకరు ఓట్ల జాబితాలు సరిలేవని సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. నిజమే! తెలంగాణ మాటకొస్తే – ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓట్ల జాబితాలు కరెక్ట్‌ గా లేవన్నది ఎప్పటినుంచో జనం మాట్లాడుకుంటున్న మాటే! ఫొటో ఉంటే పేరు కరెక్ట్‌ గా ఉండదు. పేరు కరెక్ట్‌ గా ఉంటే ఫొటో కరెక్ట్‌ గా ఉండదు. తెరాస ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ‘సకల జనుల సర్వే’ – అంటూ చేసిన సర్వే ఎలాంటి సత్ఫలితమూ ఇవ్వలేదు. “ఆంధ్రావాళ్లని ప్రత్యేకంగా గుర్తుపట్టడానికే ఈ సర్వే జరుగుతోంది” అనే భయం సర్వే సర్వత్రా ఏర్పడడం తప్ప – దాని వల్ల కలిగిన లాభం ఏమీ లేకపోయింది. అయితే ఆ తరవాత – తెరాస ప్రభుత్వం ఉమ్మడిరాజధానిలో అందరిపట్లా సానుకూల దృక్పథంతోనే వ్యవహరించడంతో ఆంధ్రులంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో – ఆంధ్రుల ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. ఓటు వేయరన్న అనుమానం ఉన్నవాళ్లని తొలగించడం, బోగస్‌ ఓటర్లను జాబితాలో కలపడం – ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీసే ఘోరమైన విషయాలు. రాజధాని ఓటర్ల జాబితాలు ఇప్పటికీ సరికాలేదనే వాదన ఉంది. రాజధాని ఆంధ్రా ఓటర్లు సహజంగానే టీఆరెస్‌కు ఓటేయకపోవచ్చన్న కారణంగానే వారికి చెందిన కొన్ని వేల ఓట్లను తొలగించారన్న నిందలు అప్పట్లో వినపడ్డాయి. అయితే – గడచిన నాలుగు సంవత్సరాల పాలనని బట్టి చూస్తే – ప్రస్తుతం రాజధాని ఆంధ్రులు చాలామంది తెరాసకి అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇప్పుడైనా ఓటర్ల లిస్టుల్ని సరిచేస్తారా? అసలు గెలుపు అనుకూలతల్ని బట్టి ప్రభుత్వాల ఓటర్ల జాబితాల్ని సరిచేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధమా? – ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు.

ఏపీలో కూడా అసలు ఓటర్ల లిస్టులు సరిగ్గా లేవట. తెలంగాణలో 30 లక్షల బోగస్‌ ఓట్లుంటే – ఆంధ్రాలో 18 లక్షలున్నాయట. అసలు ఓటరు జాబితాలు సరిగ్గా లేనప్పుడు – అది ప్రజాస్వామ్యం అవుతుందా? అన్నది అసలు ప్రశ్న!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu