
అవును. ఇది నిజం! ఒక్కసారి దీన్ని ఛార్జ్ చేస్తే 33 నెలలు ఆగకుండా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ కాదు. స్మార్ట్ వాచ్. దీని పేరు ‘అల్ట్రావాచ్ – జీ (UltraWatch-Z)’ .
ప్రతిరోజూ ఫోన్‌ని రిఛార్జ్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది. దాంతోబాటే స్మార్ట్ వాచ్‌ని కూడా ఛార్జ్ చేయాల్సివస్తే?… అది మరింత బోరింగ్. ఈ స్మార్ట్ వాచ్ .. ఆ బెడదే లేకుండా చేస్తుంది. ముప్ఫై మూడు నెలలంటే దాదాపు మూడు సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. మూడేళ్లకోసారి ఛార్జ్ చేసుకోవడం పెద్ద శ్రమేం కాదు కదా?
అతి ఎక్కువ కాలం బ్యాటరీ నిలిచి ఉండడమే కాదు, ఈ స్మార్ట్ వాచ్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా! అన్నిటికీ మించి – ఇది యాపిల్, యాండ్రాయిడ్ రెండు రకాల స్మార్ట్ ఫోన్లతోనూ పనిచేస్తుంది. కేలరీలు లెక్కపెట్టడం, ఎన్ని అడుగులు వేశామో లెక్కపెట్టడం – లాంటి ఫిట్నెస్ ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ కలిగిన ఈ వాచ్ ఎంతో ఒత్తిడిని కూడా తట్టుకోగలుగుతుంది. మూడు రంగుల్లో లభించే వాచ్ ఇండియాలో కూడా దొరుకుతుంది. దీన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు.
సింగిల్ వాచ్ రూ.6400 అవుతుంది. ఎక్కువ వాచ్‌లు కొంటే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
This post is also available in:
ఇంగ్లిష్