ఒకటి షకలక… ఇంకోటి పొలిటిక..

SriRamaNavami

ఎస్. కె. పిక్చర్స్ పతాకంపై శ్రీ సురేశ్‌ కొండేటి మరో రెండు సినిమాలు తీయబోతున్నారు.  స్టార్ కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంత చిత్రం ‘శంభో శంకర’ నిర్మాతల్లో శ్రీ సురేశ్ కొండేటి కూడా ఒకరిగా వ్యవహరించారు. అలానే ఇటీవలే మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్‌’ను తెలుగులో ‘జనతా హోటల్‌’ పేరుతో విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేశ్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. ఈ నెల 6వ తేదీ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ సురేశ్ కొండేటి మరో రెండు సినిమాలను ప్రకటించారు.

‘షకలక’ శంకర్ హీరోగా మరో సినిమా…

ప్రముఖ కమెడియన్ ‘షకలక’ శంకర్ ను హీరోగా పరిచయం చేసిన సురేశ్ కొండేటి… త్వరలోనే మరో సినిమానూ శంకర్‌ హీరోగా నిర్మించబోతున్నారు. ‘శంభో శంకర’ సినిమాకు దీటుగా… అన్ని కమర్షియల్‌ హంగులను రంగరించి ఈ సినిమా ఉంటుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్న ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోందని సురేశ్ కొండేటి తెలిపారు.

రాజకీయ నేపథ్యం ఇతివృత్తంగా మరో చిత్రం…

తెలుగు రాష్ట్రాలలోని ప్రసుత్త రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సంచలనాత్మక చిత్రానికి శ్రీ సురేశ్‌ కొండేటి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంతవరకూ వచ్చిన పొలిటికల్‌ మూవీస్ కు భిన్నంగా ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా ఉండబోతోంది. దీనికి సంబంధించిన కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తామని సురేశ్ కొండేటి చెబుతున్నారు.
తన పుట్టిన రోజునాడే జన్మదినం జరుపుకోబోతున్న తెలంగాణ సినిమాటోగ్రఫీ, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌, డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ మంత్రి, సోదర సమానులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సురేశ్ కొండేటి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu