ఐఫోన్ 11 ఎప్పుడొస్తుందో తెలిసిపోయిందోచ్‌!

అనుకోకుండా బయటపడిందా? కావాలనే బయటపెట్టారా?


సాధారణంగా ఐఫోన్ రాక గురించి ఎన్నెన్నో పుకార్లు వస్తుంటాయి. దాదాపు ప్రతీ ఏడాదీ సెప్టెంబర్‌లో కొత్త వెర్షన్ విడుదల చెయ్యడం చాలాకాలంగా జరుగుతూ ఉన్నప్పటికీ… ఏ తేదీన ఆ కొత్త వెర్షన్ వస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక్కోసారి లీక్స్, రూమర్స్ ద్వారా వాళ్ళే విషయాన్ని బయటపెడుతుండటం… కొంతమంది పుకార్లను ఊహించి రాయడం… ఇలా రెండు రకాలుగానూ ఐఫోన్‌కు క్రేజ్ పెరుగుతుంటుంది. అయితే, ఈసారి అనుకోకుండా ఒక జపనీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ ఐఫోన్ ఎప్పుడు రిలీజ్ కానుందో అనుకోకుండా చెప్పేశాడు.

ఇదెలా జరిగిందంటే, జపాన్‌లో ఒక కొత్త టెలీకమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించిన చట్టం ఒకటి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచీ అమలులోకి రానుందట. ఈయన ఒక ఇంటర్వ్యూలో ఈ చట్టం గురించి మాట్లాడుతూ – “పది రోజుల పాటు ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు” అన్నాడు. అంటే, సరిగ్గా దానికి 10 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 20వ తేదీన ఐఫోన్ విడుదలయ్యే అవకాశముంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మాత్రమే ఆ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ పది రోజులూ ఆ చట్టం వర్తించదు. మరి ఈ పది రోజులూ యాపిల్ కొత్త ఫోనుకు ఈ చట్టాన్ని వర్తింపజేయాలా… లేదా? అనేది వాళ్ళ సందిగ్ధత అన్న మాట.

ఈ విధంగా కన్ఫ్యూజన్‌కి గురయి… ఐ ఫోన్ సెప్టెంబర్ 20న విడుదల కానుందనే విషయాన్ని ఆ ఓనర్ పరోక్షంగా బయటపెట్టేయడం జరిగింది. ఇది కూడా ట్రిక్ కావచ్చు. ఏమో, క్రేజ్‌ పెంచడానికి సవాలక్ష మార్గాలు. ఏదేమైనా సెప్టెంబర్ 20న ఐఫోన్ 11 రావడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE