ఏడేళ్ల కిందటి సినిమా… ఇప్పుడూ హిట్టవుతుందా?

SriRamaNavami
అక్టోబర్ 5న ‘భాగ్యనగరం’ అనే సినిమా వస్తోంది. కాకపోతే అందులో కనిపించేది హైదరాబాద్‌ కాదు. బెంగుళూరు. ఎందుకంటే కన్నడంలో వచ్చిన ‘రాజధాని’ మూవీకి తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ఇది. కన్నడ హీరో యశ్‌ హీరోగా వచ్చిన కొత్తల్లో హిట్టయిన సినిమా ఇది. దాన్నే ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద యువ నిర్మాత సంతోష్ కుమార్ తెలుగులోకి తెచ్చి అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. ‘బిందాస్’ ఫేమ్ షీనా షహబాదీ ఈ సినిమాలో హీరోయిన్‌.
మరి ఈ సినిమా 2011 నాటిది. అయినా అప్పట్లో యశ్‌కి మంచి పేరు తెచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, చివర్లో మంచి సందేశం కూడా ఉందని సినిమా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా కన్నడ హీరో యశ్‌ నటించిందే ‘కేజీఎఫ్‌’ అనే సినిమా కూడా వస్తోంది. మరి కన్నడంలో రైజింగ్‌ స్టార్‌ అని పేరున్న యశ్‌ని తెలుగువాళ్లు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో ఈ రెండు సినిమాలతో తేలిపోనుంది.
పాపం చిన్న నిర్మాత.. ముందు ఏదో చవగ్గా ఓ డబ్బింగ్‌ సినిమా చేసి తరవాత డైరెక్ట్‌ మూవీ తీయాలని కోరికట! సరే. పాత సినిమా అయితే ఏంటి? పేరొచ్చిన సినిమాయే కదా? ఓసారి చూద్దాం ఎలా ఉందో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu