ఉబర్‌ ఓలాలకు పోటీగా ఇక బైక్‌ టాక్సీల మోత!

SriRamaNavami

టాక్సీ బుకింగ్‌ యాప్స్‌ ఉబర్‌, ఓలాలతో పాటు మరో యాప్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతోంది. అదే ర్యాపిడో! (Rapido ) ఓలా, ఉబర్‌ సర్వీసుల్లో కార్లూ ఆటోలూ బుక్‌ చేసుకునే విధంగా – ఇందులో బైక్‌ని బుక్‌ చేసుకోవచ్చు. కిలోమీటర్‌కి మూడు రూపాయలు మాత్రమే అంటూ వీళ్లు ఎడ్వర్టయిజ్‌మెంట్‌ ఇస్తున్నారు. చెప్పినంత చౌక ఏమీ కాకపోయినా – నగరాల్లో పట్టణాల్లో ఈజీ ప్రయాణాలు చేయడానికి – ర్యాపిడో మరో మంచి ఆప్షన్‌ దొరికినట్టవుతోంది. గూగుల్‌ ప్లే స్టోర్లోనూ యాపిల్‌ యాప్‌స్టోర్లోనూ కూడా ఈ యాప్‌ దొరుకుతుంది. భారతదేశంలోకెల్లా అతి పెద్ద బైక్‌ ట్యాక్సీ బుకింగ్‌ యాప్‌ ( India’s Largest Bike Taxi Booking App ) అంటూ వీళ్లు గొప్పలు చెబుతున్నప్పటికీ – తగినన్ని బైక్స్‌ ఎవైలబుల్‌ గా ఉండడం లేదని జనం గోల పెడుతున్నారు. పబ్లిక్‌ తో లింక్‌ ఉండే ఇలాంటి సర్వీస్‌ పెట్టినప్పుడు – డిమాండ్‌కి తగిన సప్లై లేకపోతే – గుడ్‌ విల్‌ దెబ్బ తినే ప్రమాదం ఉంది. త్వరలోనే ర్యాపిడో సర్వీస్‌ – డిమాండ్‌కి తగినన్ని బైకుల్ని అందించాలని కోరుకుందాం!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu