ఈ హీరోయిన్‌కి ఏ వుడ్‌ కరెక్ట్‌?


ఒక వుడ్‌ ( ఒక భాషకి చెందిన సినిమా రంగం) లో స్టార్లు అనిపించుకున్నవాళ్లు కూడా మరో వుడ్‌ విషయంలోకి వచ్చేసరికి అనామకులుగా మిగిలిపోతూ ఉంటారు. అయితే హీరోయిన్స్‌కి ఈ ఇబ్బంది తక్కువ. వాళ్లు ఎక్కడైనా నెగ్గుకు రాగలరు. మన హీరోయిన్లు అందంతోనూ టాలెంట్‌ తోనూ ఉత్తరాదిని ఏలితే.. ఉత్తరాది హీరోయిన్లు ఉత్త అందంతోనే ఇక్కడ మెరుస్తూ ఉంటారు. మరి అలా కేవలం హైదరాబాద్‌ వుడ్‌ (డాలీవుడ్‌ ) లో ఏవో కొద్ది సినిమాలు చేసిన ఈ హీనా షేక్‌.. ఇప్పుడు బాలీవుడ్‌ మీద కన్నేసింది. డాలీవుడ్ టు బాలీవుడ్ వయా టాలీవుడ్ వెళ్తానంటోంది.

ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ చిత్రాల కోవలో డాలీవుడ్ లో హిట్ అయిన ‘సలాం జిందగీ’ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీనా షేక్.. ఆ గుర్తింపుతో కొన్ని చిన్న తెలుగుసినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తానంటోంది.

తెలుగులో అలీతో ‘రంగు పడుద్ది, 127బి చిత్రాల్లో నటించిన హీనా.. ప్రస్తుతం కలర్ ఫోటో అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ అవకాశాలు వచ్చాయట. హిందీలో రెండు సినిమాలకు సైన్ చేసిందట. వాటిలో ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ఈవారం అమెరికా కూడా వెళుతోందట. కాబట్టి ఒక రూట్‌ దొరికినట్టే! ఇంకేం? “కళకు భాషాభేదాలు లేవు, అన్ని భారతీయ భాషా చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తా!” అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చేస్తోంది. అలా జరిగితే మంచిదే మరి!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE