ఈ ఏడాదే మడత ఫోన్లు రావడం ఖాయం!


మడిచిపెట్టగల ఫోన్లు ఇదివరకూ ఉన్నాయి. అయితే స్క్రీన్‌ని కూడా మడతేసి పెద్ద డిస్‌ప్లేని తక్కువ స్పేస్‌లో ఇవ్వగలిగే కొత్తతరం ఫోన్లు ఇప్పుడు రాబోతున్నాయి. అది కూడా ఎప్పుడో కాదు. ఈ ఏడాదే!

అమెరికాలో లాస్‌ వెగాస్‌లో ఏటా జరిగే సిఇఎస్‌ (కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో) లో టెక్నాలజీ ట్రెండ్స్‌ తెలుస్తాయి. ఈ షో ద్వారా 2019 లో ఫోల్డబుల్‌ ఫోన్లు రిలీజ్‌ చేయబోతున్నట్టు శామ్‌సంగ్‌ ఎన్నో కొత్త ఫోన్ల గురించి సమాచారం ఇచ్చింది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్లలో నిజానికి రెండు స్క్రీన్లుంటాయి. ఆ రెండు స్క్రీన్లూ మ్యాగ్నెటిక్‌గా లింక్‌ కలిగి ఉంటాయి. మొదటి స్క్రీన్‌ ఫోన్‌ మూసి ఉన్నప్పుడు – పైన కనిపిస్తుంది.  ఫోన్‌ ని తెరిచినపుడు – రెండు స్క్రీన్లూ ఒక్క స్క్రీన్‌గా అతుక్కోవడం – అది కూడా రెండో వైపున… అదీ ఈ ఫోన్స్‌ లోని విశేషం!

ఫోల్డబుల్‌ ఫోన్లు మాత్రమే కాదు, ఈ ఏడాది రోలబుల్‌ ( ముడిచి వేయగల ) ఫోన్లు, 4K ఫోన్లూ కూడా రానున్నట్టు తెలుస్తోంది.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE