ఇల్లు కట్టాలంటే సౌరశక్తి సౌకర్యం ఉండాల్సిందే!


ఇంటి నడినెత్తిన సూర్యుడు ఆకాశంలో వెలుగుతుండడమే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ప్రతి ఇంటిపైనా సౌరశక్తి రిసీవర్లుండటం తప్పనిసరి అని కాలిఫోర్నియా ప్రభుత్వం అంటోంది.

కాలిఫోర్నియాలో సోలార్ ఎనర్జీ గురించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, 2020 నాటికి అక్కడ కొత్తగా కట్టబోయే ఇళ్ళన్నిటికీ పైన రూఫ్‌టాప్ సోలార్ పరికరాలు ఉండి తీరాలట! లేకపోతే ఇళ్లు కట్టడానికి వీల్లేదు. అంటే భవిష్యత్తులో అక్కడ ప్రతి ఇంట్లోనూ సౌరశక్తిని వాడుకోవడం తప్పనిసరి. అలా వాడుకోగలగడానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే ఇళ్ళు కట్టడానికి అనుమతే లభించదని చెప్పేశారు.

నిజమే, సౌరశక్తిని వాడుకోగలిగితే కరెంట్ ఖర్చు తగ్గుతుంది. ఎంతో శక్తి ఆదా అవుతుంది. పవర్‌ బిల్లులు తగ్గుతాయి. కానీ సౌరశక్తిని వాడుకోవడానికి అవసరమయ్యే పరికరాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. దాంతో ఈ నిర్ణయం పట్ల కొంత వ్యతిరేకత బయల్దేరింది. “ఇల్లు కట్టుకోవడానికి సౌర శక్తిని వాడకాన్ని తప్పనిసరి చెయ్యడమేంటి? ఇంకా టెక్నాలజీ అంత ముందుకు పోకుండా – ఇలాంటి రూల్స్‌ పెట్టడం ఘోరం! ” అని కొందరు మాట్లాడుతున్నారు.

నిజమే. సౌరశక్తి చౌకగా లభించే ప్రత్యామ్నాయమే. కానీ ఇంకా టెక్నాలజీ – సౌరశక్తిని విరివిగా వాడేసుకునేంతగా ఎదగలేదు. కలిసొచ్చే పవర్‌ కంటే పరికరాలకి ఖర్చయ్యేది ఎక్కువ. ఆ ఉద్దేశ్యంతోనే ఈ రూల్‌ 2020కి వాయిదా వెయ్యడం జరిగిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. నిజానికి సమయానికి సౌరశక్తి పరికరాలు అంత భారం కాబోవని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

ఏదేమైనా సౌరశక్తిని సమర్ధంగా చౌకగా అవకాశం వస్తే అది అందరికీ మంచిదే. ఎందుకంటే దాంట్లో ఖర్చు తక్కువ, పర్యావరణానికి మంచిది. ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని ఆధునికవాదులు అంటున్నారు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE